News October 3, 2024

జానీ మాస్టర్ అవార్డును రద్దు చేయాలని డిమాండ్

image

మహిళా కొరియోగ్రాఫర్‌‌పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్‌కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు అందుకునేందుకు ఆయన బెయిల్ కోరారు. అయితే, జానీ మాస్టర్‌కు వచ్చిన అవార్డును రద్దు చేయాలని పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే జానీ మాస్టర్ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇచ్చేవరకు హోల్డ్‌లో పెట్టాలని మరికొందరు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News October 9, 2024

ఆ వార్డులో YCPకి ఒక్క ఓటు.. ఇదెలా సాధ్యం: VSR

image

AP: హరియాణా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో APని ప్రస్తావిస్తూ MP విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాలప్పుడు తొలి 4దశల్లో జరిగిన పోలింగ్‌లో BJPకి ఎదురుగాలి వీచింది. ఐదు, ఆరు దశల్లో, APలో జరిగిన ఎన్నికల్లో EVMల ట్యాంపరింగ్ చేశారు. CBN కుట్ర ఇది. హిందూపురంలో ఓ వార్డులో YCPకి ఒక్క ఓటు వచ్చింది. ఇది సాధ్యమా? ఈ మోసాలను కప్పిపుచ్చడానికి తిరుమల లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారు’ అని ఆరోపించారు.

News October 9, 2024

యూపీఐ వాలెట్, ట్రాన్సాక్షన్ లిమిట్ పెంపు

image

డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను మరింత ప్రోత్సహించేలా UPI వాలెట్ పరిమితిని రూ. 2000 నుంచి రూ.5వేలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రతి లావాదేవీకి UPI పరిమితిని రూ.500 నుంచి రూ.1000కి, UPI 123పే లావాదేవీల లిమిట్‌ను రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. పిన్ అవసరం లేకుండా పేమెంట్స్ చేసేందుకు UPI వాలెట్, ఫీచర్ ఫోన్లు వాడే వారి కోసం యూపీఐ123పే ఉపయోగపడుతుంది.

News October 9, 2024

నేను BRS ఛైర్మన్‌ను కాదు: గుత్తా

image

TG: తాను ఇప్పుడు BRS ఛైర్మన్‌ను కాదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. శాసనమండలిలో చీఫ్ విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా గుత్తా మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఉద్యోగాల మీద మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. MLAల ఫిరాయింపుల అంశంలో గత ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.