News October 3, 2024

రూ.500పైన రీఛార్జ్‌తో 24GB ఉచిత డేటా

image

దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న BSNL ప్రారంభమై 24 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. రూ.500 కంటే ఎక్కువ విలువైన వోచర్‌తో రీఛార్జ్ చేసుకున్నవారికి అదనంగా 24GB ఉచిత డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 24లోపు రీఛార్జ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 2000 అక్టోబర్ 1న ఢిల్లీ, ముంబై మినహా దేశీయంగా BSNL టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Similar News

News November 7, 2025

బ్రిటిష్ పాలన చట్టాలతో ఆస్తి కొనుగోళ్లలో కష్టాలు: SC

image

దేశంలో ప్రాపర్టీ కొనుగోళ్లు బాధలతో కూడుకున్నవిగా మారాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘1882 నాటి చట్టాలతోనే ఇప్పటి ‘రియల్’ వ్యవహారాలు నడుస్తున్నాయి. నాటి యాక్ట్ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేస్తుంది తప్ప టైటిల్ కాదు. రిజిస్టర్డ్ సేల్‌డీడ్ లావాదేవీ విలువ రికార్డు మాత్రమే. అది యాజమాన్య హక్కు ఇవ్వదు’ అని పేర్కొంది. చట్టాలను సవరించి నేటి టెక్నాలజీతో రిజిస్ట్రేషన్లను ఆధునికీకరించాలని సూచించింది.

News November 7, 2025

HDFC బ్యాంక్ యూజర్లకు BIG ALERT

image

ఈ రాత్రి 2.30 గంటల(8వ తేదీ) నుంచి ఉ.6.30 గంటల వరకు తమ బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవని HDFC ప్రకటించింది. మెయింటెనెన్స్‌లో భాగంగా UPI, నెట్ బ్యాకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది. ఈమేరకు ఖాతాదారులకు మెసేజ్‌లు పంపుతోంది. ఆ సమయంలో ట్రాన్సాక్షన్స్ కోసం PayZapp వ్యాలెట్ వాడాలని సూచించింది. మరి మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?

News November 7, 2025

సిరీస్‌పై భారత్ కన్ను!

image

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో 2-1తో లీడ్‌లో ఉన్న భారత్ రేపు జరిగే చివరి(5వ) మ్యాచులోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ కోల్పోగా ఇదైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. అయితే మ్యాచ్ జరిగే గబ్బా(బ్రిస్బేన్) గ్రౌండ్‌లో ఆసీస్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2006 నుంచి ఇక్కడ ఆ జట్టు 8 టీ20లు ఆడగా కేవలం ఒక్కదాంట్లోనే ఓడింది. దీంతో ఆసీస్‌ను ఇండియా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.