News October 3, 2024

స్వల్ప గాయాలతో బయటపడ్డా: హీరోయిన్

image

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో జరిగిన ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డానని హీరోయిన్ ప్రియాంకా మోహన్ తెలిపారు. ‘నేను క్షేమంగా ఉన్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. నేను క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు మెసేజ్‌లు, ట్వీట్స్ చేశారు. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని ఆమె ట్వీట్ చేశారు.

Similar News

News January 20, 2026

ఇతిహాసాలు క్విజ్ – 129

image

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి శూర్పణఖ అసలు పేరు ఏమిటి? ఆ పేరుకు అర్థం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 20, 2026

‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకంలో రాయితీ ఇలా..

image

TG: ఈ పథకం కింద యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది. లబ్ధిదారుల కేటగిరీని బట్టి దీనిలో వాటా ఉంటుంది. సన్న, చిన్నకారు, మహిళా రైతులు, SC, ST, BC రైతులు యంత్రాన్ని కొనుగోలు చేస్తే ధరలో 50% వారు భరించాలి. మిగిలిన 50 శాతాన్ని ప్రభుత్వం రాయితీగా నేరుగా కంపెనీ ఖాతాలో జమ చేస్తుంది. ఇతర రైతులు యంత్రం ధరలో 60 శాతం వాటాను భరించాల్సి ఉండగా.. 40 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది.

News January 20, 2026

భక్తులకు TTD గుడ్ న్యూస్.. ఇక రెండుపూటలా అన్నప్రసాదం!

image

AP: CM చంద్రబాబు ఆదేశాల మేరకు మార్చి నెలాఖరు నుంచి TTD పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తులకు రెండుపూటలా అన్నప్రసాదం అందించనున్నట్లు EO అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. మొత్తం 56 ఆలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. వీటితో పాటు ఖాళీగా ఉన్న AE పోస్టుల భర్తీకి ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ నిర్వహించాలని, కొత్తగా ఎంపికైన వేద పారాయణదారులకు నియామక పత్రాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.