News October 3, 2024

గడియారం గుర్తును వాడకుండా అజిత్‌ను అడ్డుకోండి: శరద్ పవార్

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ ఆధ్వర్యంలోని NCP గడియారం గుర్తును ఉపయోగించకుండా అడ్డుకోవాలంటూ శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. NCP SP, NCPల గుర్తుల విషయంలో ఇప్పటికీ ప్రజల్లో అయోమయం నెలకొందని పేర్కొన్నారు. పారదర్శక ఎన్నికల కోసం గడియారం గుర్తు వాడుకోకుండా అజిత్ వర్గాన్ని అడ్డుకోవాలని కోరారు. గతంలో పార్టీ చీలికతో మెజారిటీ MLAలు అజిత్ వైపు ఉండడంతో గుర్తు ఆయనకే దక్కింది.

Similar News

News October 9, 2024

CM రేవంత్‌రెడ్డిని కలిసిన BRS MLA మల్లారెడ్డి

image

TG: BRS MLA మల్లారెడ్డి CM రేవంత్‌రెడ్డిని కలిశారు. తన మనవరాలి వివాహానికి రావాలంటూ రేవంత్‌కు ఆహ్వానపత్రిక అందజేశారు. అటు మాజీ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం చంద్రబాబును సైతం మల్లారెడ్డి ఆహ్వానించారు.

News October 9, 2024

J&K ప్రజలకు కృతజ్ఞతలు: రాహుల్ గాంధీ

image

జమ్మూకశ్మీర్‌లో తమ కూటమి సాధించిన గెలుపు రాజ్యాంగ విజయంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. విజయాన్ని అందించిన J&K ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. హరియాణాలో వచ్చిన ఊహించని ఫలితాలపై విశ్లేషిస్తున్నామని తెలిపారు. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తున్నామని ట్వీట్ చేశారు.

News October 9, 2024

‘దసరా’కి ఆరు సినిమాలు..

image

ఈ దసరాకు తెలుగులో ఆరు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో ముందుగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ ఈనెల 10న విడుదలవనుంది. 11వ తేదీన సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’, గోపీచంద్ ‘విశ్వం’, ఆలియా భట్ ‘జిగ్రా’, ధ్రువ సర్జా ‘మార్టిన్’ రిలీజ్ కానున్నాయి. కాగా సుహాస్ ‘జనక అయితే గనక’ మూవీ ఈనెల 12న రానుంది. వీటిలో మీరు ఏ మూవీకి వెళ్లాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి.