News October 3, 2024

చదువుతోనే కాకుండా క్రీడలతోనూ భవిష్యత్తు: రేవంత్

image

TG: యువత డ్రగ్స్ జోలికి వెళ్తే ఏమి సాధించలేరని సీఎం రేవంత్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎం కప్ క్రీడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చదువుతోనే కాకుండా క్రీడలతోనూ భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. దానికి సిరాజ్, నిఖత్ జరీన్, మాలవత్ పూర్ణ నిదర్శనమన్నారు. రాష్ట్ర అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. 2028 ఒలింపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారులు పతకాలు సాధించాలన్నారు.

Similar News

News July 4, 2025

PHOTO: గోల్కొండ కోట అందం చూశారా?

image

హైదరాబాద్‌లోని గోల్కొండ కోట చాలా ఏళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ కోటను ఎప్పుడైనా మీరు ఆకాశంలో నుంచి చూశారా? దీని ఏరియల్ వ్యూకు సంబంధించిన దృశ్యం ఆకట్టుకుంటోంది. పచ్చని చెట్ల నడుమ కోట నిర్మాణం అబ్బురపరుస్తోంది. బోనాల సందర్భంగా ఈ ఫొటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరలవుతోంది.

News July 4, 2025

పనిమనిషి కుటుంబ ఆదాయం రూ.లక్ష!.. reddit పోస్ట్ వైరల్

image

తన ఇంట్లో పనిచేసే ఓ మహిళ కుటుంబం తనకంటే ఎక్కువ సంపాదిస్తోందని తెలిసి ఆశ్చర్యపోయిన ఓ వ్యక్తి redditలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘మా పనిమనిషి ఇళ్లలో పనిచేయడం ద్వారా నెలకు రూ.30వేలు, కూలీగా ఆమె భర్త రూ.35వేలు, పెద్ద కొడుకు రూ.30వేలు, టైలరింగ్ చేస్తూ కుమార్తె రూ.3వేలు, చిన్న కొడుకు రూ.15వేలు సంపాదిస్తున్నాడు. ఇలా ఎలాంటి పన్ను చెల్లించకుండా నెలకు రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నారు’ అని రాసుకొచ్చారు.

News July 4, 2025

ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ ఎప్పుడంటే?

image

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఇతర నటీనటులతో సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం అవుతుందని, ప్రభాస్ నవంబర్ నుంచి షూట్‌లో పాల్గొంటారని మూవీ టీమ్‌కు చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ఇందులో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో రెబల్ స్టార్ కనిపించనున్నట్లు సమాచారం. త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు.