News October 3, 2024
విశాఖలో టెట్ పరీక్షకు 3439 మంది హాజరు

విశాఖలో గురువారం నిర్వహించిన టెట్ పరీక్షకు 3931 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 3439 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. మొత్తం 492 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. నగరంలో ఉదయం 5 కేంద్రాల్లోనూ మధ్యాహ్నం మూడు కేంద్రాల్లోనూ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బుచ్చిరాజుపాలెం సెంటర్‌ను సందర్శించినట్లు తెలిపారు.
Similar News
News July 4, 2025
బ్యాంకర్లకు విశాఖ కలెక్టర్ కీలక ఆదేశాలు

సామాన్యుల ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు సహకారం అందించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టరేట్ మీటింగు హాలులో శుక్రవారం సమావేశమయ్యారు. స్వయం సహాయ సంఘాల సభ్యులకు అందించే రుణాలను సకాలంలో రెన్యువల్ చేయాలని, వారి పొదుపు ఖాతాలోని 50శాతం సొమ్మును ఆటోమేటిక్‌గా ఎఫ్.డి. చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News July 4, 2025
విశాఖ CPT పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష

ఏపీ పీసీబీలో నియమితులైన గ్రూప్-2, గ్రేడ్-2 ఉద్యోగుల సీపీటీ పరీక్ష శనివారం మూడు సెషన్లలో జరగనున్నది. 186 మంది అభ్యర్థులు గాజువాక ఎస్.ఎస్. సొల్యూషన్స్ కేంద్రంలో జరిగే పరీక్షకు హాజరవుతారు. ఏర్పాట్లను డీఆర్వో భవానీ శంకర్ సమీక్షించారు. అభ్యర్థులు గంట ముందే రాగలరని, ఐడీ కార్డ్ తీసుకురావాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం.
News May 7, 2025
దివ్యాంగుల పూర్తి సమాచారం సేకరించాలని కలెక్టర్ ఆదేశాలు

దివ్యాంగుల సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ శనివారం నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. దివ్యాంగుల చట్టాలు పక్కాగా అమలు జరగాలన్నారు. దివ్యాంగ బాలలను పాఠశాలలో చేర్పించాలని సూచించారు. 18 ఏళ్ల లోపు దివ్యాంగుల పెన్షన్ డేటాను సేకరించాలని ఆదేశించారు. జిల్లాలో దివ్యాంగుల పూర్తి సమాచారం సేకరించాలన్నారు. దివ్యాంగుల కోసం అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ర్యాంపులు నిర్మించాలని సూచించారు.