News October 3, 2024
ఫామ్ హౌస్‌లు ఎక్కడున్నాయో వివరాలు బయట పెట్టాలి: సబిత

TG: అక్రమంగా నిర్మించిన సబిత ఫామ్ హౌస్‌ను కూల్చాలా? అన్న సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి సబిత కౌంటర్ ఇచ్చారు. తన అబ్బాయి కడుతున్న ఇల్లు మినహాయించి 3 ఫామ్ హౌస్‌లు ఎక్కడున్నాయో వివరాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్ని రకాలుగా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. రేవంత్ మాట తీరును తెలంగాణ సమాజం గమనిస్తుందని Xలో పేర్కొన్నారు.
Similar News
News February 23, 2026
స్కూలు విద్యార్థులకు SM నిషేధిస్తూ చట్టం: అనిత

AP: పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించకుండా చట్టం తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. SMలో తప్పుడు ప్రచారాల కట్టడికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్వేషపూరిత, అసభ్య పోస్టుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్రంలో SM పోస్టులపై 1,384 కేసులు నమోదు చేశామని, 1,067 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పారు.
News February 23, 2026
కర్ణాటక హైకోర్టుకు రణ్‌వీర్ సింగ్

తనపై నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేయాలని కోరుతూ బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అర్జెంట్ హియరింగ్ చేపట్టాలన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకని.. పిటిషనర్ బాలీవుడ్ స్టార్ కాబట్టి విచారణ వేగవంతం చేయాలా? అని జస్టిస్ నాగప్రసన్న ప్రశ్నించారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. కాంతారలో దైవాన్ని కించపరిచారంటూ <<18988013>>రణ్‌వీర్‌పై<<>> కేసు నమోదైంది.
News February 23, 2026
టాక్సిక్ ఫ్రెండ్స్‌కి ఇలా చెక్ పెట్టేయండి

ఈరోజుల్లో మన ముందు పొగిడి, వెనక తిట్టుకునే వాళ్లే ఎక్కువ. అయితే వీరిలో చాలామంది స్నేహం ముసుగులో మనం ఏం చేసినా ప్రతీదాన్నీ వ్యతిరేకంగా చూస్తూనే, పైకి ప్రేమగా నటిస్తారు. మనసులో మాత్రం ద్వేషాన్ని నింపుకుంటారు. వీరినే టాక్సిక్ ఫ్రెండ్స్ అంటారు. ఇలాంటివారి గురించి తెలిస్తే కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యాలంటున్నారు నిపుణులు. వీరికి ఇంపార్టెన్స్ ఇస్తూనే కాస్త ప్రైవసీ పాటించాలని సూచిస్తున్నారు.


