News October 3, 2024
BJPకి ప్రచారం.. 2గంటల్లోనే కాంగ్రెస్‌లోకి

హరియాణాకు చెందిన మాజీ MP అశోక్ తన్వర్ కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన తన్వర్ 2019లో పార్టీకి గుడ్ బై చెప్పి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. 2022లో AAP తీర్థం పుచ్చుకున్నారు. 2024 ప్రారంభంలో BJP కండువా కప్పుకొని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈరోజు జింద్ జిల్లాలోని సఫిడాన్‌లో BJP తరఫున ప్రచారం చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే కాంగ్రెస్‌లో చేరారు.
Similar News
News February 4, 2026
డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ నేమ్ ‘స్వయం’

AP: డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించాల్సిన అవసరముందని CM CBN పేర్కొన్నారు. సచివాలయంలో డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం వివిధ లోగోలు, పేర్లను CM పరిశీలించారు. ‘‘స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తులను తయారు చేస్తున్నందున ‘స్వయం’ అనే పేరు బాగుంటుంది. లోగో కూడా అదే డిజైన్‌తో ఉండాలి’’ అని సూచించారు. బ్రాండ్ పేరు, లోగోతోనే కాన్సెప్ట్ అర్థమయ్యేలా ఉండాలన్నారు.
News February 4, 2026
DANGER: పచ్చి ఉల్లిపాయలు తింటున్నారా?

బిర్యానీతో పాటు పచ్చి ఉల్లిపాయలు కలిపి తింటే టేస్ట్ అదిరిపోతుంది కదా. కానీ వాటిని సరిగా శుభ్రం చేయకపోతే గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, సిస్టిక్ సిర్రోసిస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అలాగే గుండెల్లో మంట, నోటి దుర్వాసన వస్తాయి. కాబట్టి వీటిని తినే ముందు శుభ్రంగా కడిగి తినాలి. వీటిని తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
News February 4, 2026
సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్

UPSC సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ 2026 విడుదలైంది. ఈ ఏడాది ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల్లో మొత్తం 933 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇవాళ్టి నుంచి ఈనెల 24వ తేదీ 6PM వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌ను <


