News October 3, 2024
బెల్లంపల్లి: PG సీట్ల వెబ్ ఆప్షన్స్.. ఈనెల 4న చివరి తేదీ

బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న కాకతీయ యూనివర్సిటీ PG రెగ్యులర్ కోర్సుల కోసం 2వ విడతలో అక్టోబర్ 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి గడువు ఉందని ప్రిన్సిపల్ శంకర్, కోఆర్డినేటర్ తిరుపతి తెలిపారు. వారు మాట్లాడుతూ..2024-25 విద్య సంవత్సరానికి CPGET ఎంట్రన్స్ పరీక్షలు రాసిన విద్యార్థులు విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News January 19, 2026
రూ.4.25 కోట్ల వడ్డీ లేని రుణాలు: ADB కలెక్టర్

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణీలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 1049 సంఘాలకు గాను రూ.4,25,70,880 విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, కమిషనర్ సీవీఎన్ రాజు పాల్గొన్నారు.
News January 19, 2026
ఎన్నికల విధుల్లో వారికి మినహాయింపు: ADB కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సంబంధిత నోడల్ అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు, సిబ్బంది కేటాయింపు, లాజిస్టిక్స్ అంశాలపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధులకు గర్భిణీలు, బాలింతలు, దివ్యాంగులు, అలాగే వచ్చే మార్చి నెలాఖరు నాటికి పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని సూచించారు.
News January 17, 2026
ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ బదిలీ

ఉట్నూర్ అదనపు ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కాజల్ సింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్‌ల బదిలీలు చేపడుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏఎస్పీ కాజల్ సింగ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ 2 డీసీపీగా బదిలీ చేశారు. కొంత కాలంగా ఉట్నూర్ ఏఎస్పీగా ఉన్న ఆమె పలు కేసుల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించారు.


