News October 3, 2024

మహిళల T20WCలో బోణీ కొట్టిన బంగ్లాదేశ్

image

మహిళల T20 వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. స్కాట్లాండ్‌పై 16 పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 రన్స్ చేసింది. 120 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 103 రన్స్ మాత్రమే చేయగలిగింది. రేపు రా.7.30 న్యూజిలాండ్‌తో భారత్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

Similar News

News October 4, 2024

ఈ నెల 14న‌ హ్యుందాయ్ IPO

image

దేశీయ స్టాక్ మార్కెట్లోనే ₹25,000 కోట్ల అతిపెద్ద‌ హ్యుందాయ్ IPO అక్టోబ‌ర్ 14న ప్రారంభంకానున్న‌ట్టు తెలుస్తోంది. సెబీకి దాఖలు చేసిన కంపెనీ DRHP ప్రకారం సంస్థ‌ భారతీయ విభాగం కంపెనీ, ప్ర‌మోట‌ర్ల ద్వారా 142,194,700 ఈక్విటీ షేర్ల ఆఫర్-ఫర్-సేల్ (OFS)ని ప్రతిపాదించింది. ఈ IPOతో మారుతీ సుజుకి తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా గత 20 ఏళ్లలో ప్రజలకు షేర్లు ఆఫర్ చేస్తున్న మొదటి కార్ల తయారీ సంస్థగా అవతరించనుంది.

News October 4, 2024

కేటీఆర్, హరీశ్‌పై కేసు నమోదు

image

TG: మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సైబరాబాద్‌లో పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కొండా సురేఖతో ఉన్న ఫొటోలపై ట్రోలింగ్ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీంతో కేటీఆర్, హరీశ్‌తో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News October 4, 2024

నిజం మాట్లాడినందుకు క్షమించండి: కర్ణాటక మంత్రి

image

హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్‌ గొడ్డు మాంసం తినేవారని చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి దినేష్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సావర్కర్ గొడ్డు మాంసం తిన‌డం మాత్ర‌మే కాకుండా, ఆ ఆచారాన్ని బహిరంగంగా ప్రచారం చేశార‌ని చెప్పడంతో వివాదం చెలరేగింది. దీంతో ‘నిజం మాట్లాడినందుకు క్ష‌మించండి’ అని దినేష్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సావర్కర్ బ్రిటిష్ వారికి చెప్పారంటూ పోస్ట్ చేశారు.