News October 3, 2024
USCIRF మత స్వేచ్ఛ నివేదికను తోసిపుచ్చిన భారత్
భారత్లో మత స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తం చేస్తూ యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం (USCIRF) ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. దీన్ని ఏకపక్ష, రాజకీయ ప్రేరేపిత నివేదికగా పేర్కొంది. ఈ నివేదిక USCIRFని మరింత అప్రతిష్ఠపాలు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని దుయ్యబట్టింది. USలో మానవ హక్కుల సమస్యల పరిష్కారానికి USCIRF తన సమయాన్ని వినియోగించుకోవాలని సలహా ఇచ్చింది.
Similar News
News December 22, 2024
ఇవి అత్యంత ఖరీదైన చీరలు
చీరలు స్త్రీల అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంటాయి. అందుకే భారత మహిళలు చీర కట్టును ఇష్టపడుతుంటారు. చీరల్లో లెక్కలేనన్ని రకాలున్నా వాటిలో అత్యంత ఖరీదైనవి మాత్రం కొన్నేే. అవి.. మూంగా పట్టుచీర: ధర రూ.2 లక్షల వరకు ఉంటుంది. పటాన్ పటోలా చీర: రూ.లక్ష వరకూ ఉంటుంది. కడ్వా కట్వర్క్ చీర: రూ.5 లక్షల వరకూ ధర ఉంటుంది. కాంచీపురం పట్టుచీర: ధర రూ.5 లక్షల వరకూ ఉంటుంది. బనారస్ పట్టుచీర: రూ.5 లక్షల వరకూ ఉంటుంది.
News December 22, 2024
FEB 28 వరకు పీసీ ఘోష్ కమిషన్ గడువు
TG: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణకు నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం నాలుగోసారి పొడిగించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు అవకాశమిచ్చింది. గత ఏడాది అక్టోబర్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లలో సమస్యలు బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
News December 22, 2024
రాష్ట్రానికి తప్పిన ముప్పు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు IMD వెల్లడించింది. దీంతో రాష్ట్రానికి భారీ వర్షాల ముప్పు తప్పినట్లేనని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 3 రోజులపాటు మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 55Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది. సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.