News October 3, 2024
ధర్మారెడ్డి ఎక్కడ?: పవన్
AP: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మాత్రమే బయటకొచ్చి మాట్లాడుతున్నారన్నారు. తన బిడ్డ చనిపోతే గర్భాలయంలోకి వచ్చిన ధర్మారెడ్డి లడ్డూ వివాదం రాగానే మాయమయ్యారని ఆక్షేపించారు. ఆయనపై చాలా ఆరోపణలున్నాయని, అన్నింటినీ బయటకు తీస్తామని చెప్పారు. తాను బాధ్యతలు తీసుకున్నప్పుడు నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని ప్రస్తుత ఈవో చెప్పారన్నారు.
Similar News
News January 2, 2025
CMR కాలేజీ హాస్టల్ వార్డెన్ అరెస్ట్
TG: CMR <<15046521>>కాలేజీ హాస్టల్<<>> వార్డెన్ ప్రీతిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్‌లో జరుగుతున్న ఘటనలకు ఆమెనే కారణమని ఆరోపణలు రావడంతో అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బాత్ రూం పక్కనే వంట సిబ్బంది రూం ఉందని, వాళ్లే వీడియోలు తీసి ఉంటారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సీఎంఆర్ కాలేజీ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రీతిరెడ్డిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.
News January 2, 2025
తరం మారింది! న్యూఇయర్ వేడుకల తీరూ మారింది!
న్యూఇయర్ వేడుకల తీరులో క్రమంగా మార్పు వస్తోందని విశ్లేషకులు అంటున్నారు. యూత్ తాగి తూగడమే కాదు దైవ సన్నిధిలో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంటున్నారు. కాశీ, అయోధ్య, పూరీ, మథుర, తిరుమల, శ్రీశైలం, ఉజ్జయిని, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలను DEC 31, JAN 1న లక్షల్లో సందర్శించడాన్ని ఉదహరిస్తున్నారు. AP, TG లోనూ ఆలయాలు కిటకిటలాడటం తెలిసిందే. ఇంగ్లిష్ ఇయర్‌ను ఇండియనైజ్ చేస్తున్నారని కొందరి మాట!
News January 2, 2025
ఈ నెల 17న మరోసారి క్యాబినెట్ భేటీ
AP: ఈ నెల 17న మరోసారి రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ జరిగిన భేటీలో కొన్ని అంశాలపై అసంపూర్తిగా చర్చించారు. వీటిపైనే ఆ రోజు తుది నిర్ణయం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.