News October 3, 2024
పవన్‌ను చూస్తుంటే ‘కెవ్వు కేక’ సాంగ్ గుర్తొస్తుంది: భూమన

AP: వైసీపీ చీఫ్ జగన్ మీద ఇష్టం వచ్చినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ రాజకీయ ప్రేలాపనలు చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ దుయ్యబట్టారు. సనాతన ధర్మాన్ని ఆయన రక్షిస్తున్నట్లుగా పవన స్వాముల మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడటం వెనుక వేరే అజెండా ఉందన్నారు. పవన్ స్వామిని చూస్తుంటే ‘కెవ్వు కేక’ సాంగ్ గుర్తొస్తుందన్నారు. ఆయన పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
Similar News
News January 12, 2026
టిమ్ కుక్ తర్వాత యాపిల్ బాస్ ఇతనేనా?

యాపిల్ CEOగా టిమ్ కుక్ తర్వాత జాన్ టెర్నస్ బాధ్యతలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. 50 ఏళ్ల ఈ హార్డ్‌వేర్ ఎక్స్‌పర్ట్ 2001 నుంచే కంపెనీలో ఉన్నారు. ఐఫోన్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్ వంటి హిట్ ప్రొడక్ట్స్ వెనుక ఇతని హస్తం ఉంది. కాలేజీ రోజుల్లో వర్సిటీ స్విమ్మర్ అయిన టెర్నస్ ఇప్పుడు యాపిల్ పగ్గాల కోసం రేసులో ముందున్నారు. ఆయన డీటైలింగ్, ఇంజనీరింగ్ నాలెడ్జ్ యాపిల్‌కు కొత్త వెలుగునిస్తాయని భావిస్తున్నారు.
News January 12, 2026
పండుగల్లో ఆఫర్ల మాయలో పడకండి

పండుగ సమయాల్లో ప్రకటించే ఆఫర్ల మాయలో పడ్డామంటే బడ్జెట్ దాటిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఒక్కరోజు ఆనందం కోసం చూస్తే కొన్ని నెలలపాటు సర్దుబాటు చేసుకోవాలి. కాబట్టి అప్పు తీసుకోవద్దు అనే నియమాన్ని పాటించండి. వేటికెంత కేటాయించాలో ముందే నిర్ణయించుకోండి. నాణ్యతలో రాజీ పడకూడదు. డిస్కౌంట్లు ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఏమేం కావాలో జాబితా రాసుకొని దానికే పరిమితమవ్వాలి.
News January 12, 2026
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు

కాన్పూర్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<


