News October 3, 2024
ఆ విషయంలో గాంధీ తరువాత మోదీనే: అమిత్ షా

గుజరాత్‌కు చెందిన ఇద్దరు పుత్రులు మహాత్మా గాంధీ, ప్రధాని మోదీ మాత్రమే దేశ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత పౌరుల ఆరోగ్యం, ఆయుర్దాయం గురించి ఆందోళన చెందుతూ పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణంపై ఎర్రకోట నుంచి మోదీ విజ్ఞప్తి చేశారన్నారు. గాంధీ తర్వాత పరిశుభ్రత ప్రాథమిక అవసరాన్ని వివరించిన 2వ జాతీయ నాయకుడు మోదీ అని పేర్కొన్నారు.
Similar News
News March 5, 2026
టాస్ ఓడిన భారత్.. జట్టు ఇదే

T20WC: INDతో జరగనున్న సెమీఫైనల్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత్: శాంసన్, అభిషేక్, కిషన్, తిలక్, సూర్య (C), హార్దిక్, దూబే, అక్షర్, వరుణ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
ఇంగ్లండ్: సాల్ట్, బట్లర్, బ్రూక్ (C), బెథెల్, బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, ఓవర్టన్, డాసన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్.
News March 5, 2026
‘అస్థిర’ నేపాల్: 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు..

నేపాల్‌లో 2008లో రాచరిక పాలన అంతమయ్యాక ప్రచండ(నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ-మావోయిస్ట్) అధికారాన్ని చేపట్టారు. అయితే ఏడాదికే ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మార్కిస్ట్, నేపాలీ కాంగ్రెస్ నేతలు PM పీఠం చేపట్టారు. అవినీతి, పార్టీలకు మెజార్టీ లేకపోవడంతో 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారాయి. కేపీ ఓలీ సర్కార్ కూలిన తర్వాత ఇవాళ ఎన్నికలు జరిగాయి. విజేత ఎవరో రేపు <<19301003>>తేలనుంది.<<>>
News March 5, 2026
రాచరికం నుంచి రిపబ్లిక్ వరకు.. నేపాల్ హిస్టరీ ఇదే

శతాబ్దాలపాటు నేపాల్‌లో రాచరిక పాలన ఉండేది. 1960లో కింగ్ మహేంద్ర పార్లమెంటును రద్దు చేసి పార్టీలు లేని పంచాయతీ వ్యవస్థను తీసుకొచ్చారు. 1990లో రాజు బీరేంద్ర రాజకీయ పార్టీలపై నిషేధాన్ని ఎత్తేశారు. 1996లో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(మావోయిస్ట్) రాచరికాన్ని పడగొట్టడానికి తిరుగుబాటును ప్రారంభించింది. 2001లో బీరేంద్రను చంపేశారు. చివరికి 2008లో 240 ఏళ్ల రాచరిక పాలన రద్దై నేపాల్ గణతంత్ర రాజ్యంగా మారింది.


