News October 3, 2024
శ్రీకాకుళం: ల్యాబ్ టెక్నీషియన్స్ ఎన్నిక ఏకగ్రీవం

జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా జె.కేశవరావు, బి.అప్పలరాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఆవరణలో గురువారం జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని జిల్లాలోని ఆయా పీహెచ్సీలు, ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు ఎన్నుకున్నారు. ట్రెజరీగా విజయ్ కుమార్, అసోసియేటివ్ ప్రెసిడెంట్‌గా లూసీ ఎస్టర్, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
Similar News
News January 19, 2026
ఉచిత పశువైద్య శిబిరాల పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రి అచ్చెన్న

ఏపీలో ఉచిత పశు వైద్య శిబిరాలు తేదీల షెడ్యూల్ పోస్టర్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం తాడేపల్లిలోని కార్యాలయంలో ఆవిష్కరించారు. రైతులు శ్రేయస్సుకు కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగానే పాడి పశువులను పోషించేందుకు ప్రోత్సహిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పాడి సంపద అభివృద్ధి చేయాలని తెలియజేశారు.
News January 19, 2026
మెళియాపుట్టి: ‘వినోదం కోసం వెళ్తే విషాదం ఆవరించింది’

వినోదం కోసం పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట ఆడలి వ్యూ పాయింట్‌కు వెళ్లిన కుటుంబంలో విషాదం నింపింది. నిన్న సాయంత్రం ఏజెన్సీలో ప్రకృతి అందాలను చూసి తిరిగి ఆటోలో వస్తుండగా..వారి వాహనం ఆడలి వ్యూ పాయింట్ వద్ద రక్షణ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంద్రరావు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు మెళియాపుట్టి మండలానికి చెందిన వారిగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 19, 2026
SKLM: నేటి నుంచి సురభి నాటక వైభవం

కళల కాణాచి శ్రీకాకుళం నగరంలో పౌరాణిక నాటక సందడి మొదలవనుంది. అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రసిద్ధ సురభి నాటక సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరగనున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఈ నాటకోత్సవాలు జరుగుతాయి. స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియం వేదికగా సోమవారం (జనవరి 19) నుంచి ఐదు రోజుల పాటు ప్రదర్శనలు కొనసాగనున్నాయి.


