News October 4, 2024
ఆర్థిక మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ఆర్థిక మోసలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దౌత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదనపు కలెక్టర్ దాసరి వేణు, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఏజీఎం రాధికభరత్ లతో కలిసి ఆర్థిక మోసాలు, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజలు ఓటిపిలు ఎవరికి చెప్పవద్దని, అపరిచిత ఫోన్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News January 14, 2026
ADB: చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిలాబాద్‌లోని నేషనల్ మార్ట్ సమీపంలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని కాలనీవాసులు తెలిపారు. ఈ మేరకు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News January 13, 2026
ఆదిలాబాద్: రూ.90 పెరిగిన పత్తి ధర

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,710గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ.90 పెరిగినట్లు వెల్లడించారు.
News January 12, 2026
ADB: రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా జమునా నాయక్

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని దానోరా (బి) సర్పంచ్ జాదవ్ జమునా నాయక్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సర్పంచుల సంఘం బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. క్రమశిక్షణతో పాటు రాష్ట్ర అభివృద్ధికై తోడ్పాటు చేస్తానని జమునా నాయక్ పేర్కొన్నారు.


