News October 4, 2024

ఉమ్మడి జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ

image

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్సైలను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు వాడపల్లి ఎస్సైగా పనిచేస్తున్న ఈడుగు రవి, హాలియా ఎస్సై సతీష్ రెడ్డిలను నల్లగొండ ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. అదే విధంగా సూర్యాపేట జిల్లాలోని పెన్ పహాడ్ ఎస్సై రవీందర్, ఆత్మకూరు(ఎస్) ఎస్సై వై.సైదులు, తుంగతుర్తి ఎస్సై ఏడుకొండలును ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేశారు.

Similar News

News March 13, 2026

NLG: ఒక్కో పంటపై రూ.2వేల పెంపు..!

image

రాబోయే సాగు సీజన్‌కు సిద్ధమవుతున్న జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ పంటల రుణ పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాదితో పోల్చితే ఒక్కో పంటపై అదనంగా రూ.2,000లు పెంచుతూ బ్యాంకర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నల్లగొండ జిల్లాలోని సుమారు 5,65,803 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

News March 13, 2026

NLG: గ్యాస్ ‘గందరగోళం’.. సర్వర్లు డౌన్

image

జిల్లాలో సామాన్యుడి వంట గదిలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. సిలిండర్ల కొరత ఏర్పడుతుందన్న భయంతో వినియోగదారులు ఒక్కసారిగా రీఫిల్లింగ్ కోసం ఎగబడుతుండటంతో బుకింగ్ నెట్‌వర్క్ పూర్తిగా కుప్పకూలింది. వినియోగదారులు గ్యాస్ రీఫిల్ కోసం ఆశ్రయించే డిజిటల్ మార్గాలు ప్రస్తుతం చేతులెత్తేశాయి. వేల సంఖ్యలో వినియోగదారులు ఏకకాలంలో ప్రయత్నిస్తుండటంతో మిస్డ్ కాల్, IVRS వ్యవస్థలు పనిచేయడం లేదని డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు.

News March 13, 2026

జిల్లా రైతాంగంపై రూ.35 కోట్ల అదనపు భారం!

image

పెట్టుబడి కష్టాలతో సతమతమవుతున్న రైతులను ఎరువుల ధరల పెంపు దెబ్బ తీస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారిపై కోలుకోలేని దెబ్బ పడేలా చేసింది. ఈ తాజా నిర్ణయంతో ఎరువుల బస్తాపై ఏకంగా రూ.100 నుంచి రూ.200 వరకు ధరలు పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా సాగయ్యే విస్తీర్ణాన్ని బట్టి లెక్కగడితే, ఈ ధరల పెరుగుదల వల్ల జిల్లా రైతాంగంపై సుమారు రూ.35 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది.