News October 4, 2024

డ్యూటీలో ఉన్నప్పుడు పరిసర కార్యకలాపాలపై నిఘా ఉంచండి

image

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు విశేష సేవలు అందించాలని, విధులను నిర్వర్తించడంతో పాటు, డిప్యూటేషన్ సిబ్బంది తమ పరిసరాలపై నిఘా ఉంచి, అప్రమత్తంగా ఉండాలని, సమస్యను పరిష్కరించడంలో ముఖ్యపాత్ర పోషించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో గురువారం సాయంత్రం బ్రహ్మోత్సవాల విధులకు హాజరైన ఉద్యోగులను ఉద్దేశించి ఈఓ, అదనపు ఈఓలు మాట్లాడారు. అందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు.

Similar News

News October 4, 2024

తిరుపతి SVU ఫలితాల విడుదల

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జులైలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(BED) మూడో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణాధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News October 4, 2024

పవన్ స్పీచ్‌లో తమిళ ప్రస్తావన ఎందుకు..?

image

తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళ ప్రస్తావనపై చర్చ జరుగుతోంది. లడ్డూ వివాదం తమిళనాడులోని ఓ కంపెనీ చుట్టూ తిరుగుతోంది. మరోసారి తమిళనాడుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక ఆంతర్యం ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది. అక్కడి రాజకీయాల్లో ఏదైనా పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఇలా స్పందించారా అని అందరూ భావిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలపై తమిళనాడు ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

News October 4, 2024

శ్రీకాళహస్తిలో రూమ్స్ కావాలంటే ఇలా చేయండి

image

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వసతి గదులను ఇప్పటి వరకు సాధారణ బుకింగ్ ద్వారా భక్తులకు ఇచ్చారు. ఇక మీదట గదులు కావాలంటే బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. గదులు కావాల్సినవారు స్వయంగా వచ్చి ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డుతో గదులను బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.