News October 4, 2024
బెనిఫిట్స్ త్వరగా వచ్చే విధంగా చూడండి: ఎస్పీ

పోలీస్ శాఖలో పనిచేస్తూ చనిపోయిన, పదవి విరమణ పొందిన వారికి రావలసిన బెనిఫిట్స్ త్వరగా అందేలా చూడాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సూచించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో డిపిఓ సిబ్బంది, అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పదవి విరమణ పొందిన వారికి, మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయో వాటి వివరాలు తెలపాలని పేర్కొన్నారు.
Similar News
News March 11, 2025
మీ ఊర్లో నీటి సమస్య ఉందా?

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో 35°Cల ఉష్ణోగ్రత నమోదవుతోంది. పలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో నీటి సమస్య మొదలవుతోంది. ఈ ఏడాది నీటి ఎద్దడి నివారణకు అధికారులు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో 577 పంచాయతీలు ఉండగా నిధులు రాగానే ఉండగా సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో సరఫరా, బోర్ల మరమ్మతులు, నూతన పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు. మరి మీ ఊర్లో నీటి సమస్య ఉందా? కామెంట్ చేయండి.
News March 11, 2025
మంత్రిత్వ శాఖ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న కలెక్టర్

న్యూఢిల్లీ నుంచి భారత ప్రభుత్వం, జల్ శక్తి మంత్రిత్వ శాఖవారు జల్ శక్తి అభియాన్ “జల్ సంచయ్ జన్ భగీదారి”పై అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. “జెల్ సంచయ్ జన్ భగీదారి”పై దృష్టి సారించి వర్షాన్ని ఒడిసి పట్టీల చర్యలు చేపట్టాలని సోమవారం అన్నారు. జిల్లాలలో పురోగతిపై వర్చువల్ విధానంలో జల్ శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమీక్ష నిర్వహించారు.
News March 11, 2025
అనంత: పోలీసు గ్రీవెన్స్‌కు 61 ఫిర్యాదులు: జిల్లా SP

అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌కు ప్రజల నుంచి 61 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. ప్రజల నుంచి ఆయన నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబందిత పోలీసు అధికారులకు పంపి బాధితులకు న్యాయం చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు.