News October 4, 2024
ఆ పథకాన్ని తొలగించట్లేదు: ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం

AP: రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేయరంటూ మరోసారి ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని(గతంలో ఆరోగ్య శ్రీ) తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఇది పూర్తిగా అబద్ధపు ప్రచారమని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జీవో ఫేక్ అని తెలిపింది.
Similar News
News January 5, 2026
వేల ఏళ్ల విశ్వాసం.. సోమనాథ్ పునరుజ్జీవనంపై మోదీ ట్వీట్!

సోమనాథ్ ఆలయంపై పాషండుల తొలి దాడి జరిగి 1000 ఏళ్లు, పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. 1026లో గజనీ మహమ్మద్ దాడి చేసినా ఎవరూ విశ్వాసం కోల్పోలేదని, అందుకే నేటికీ ఆలయం కళకళలాడుతోందని ఆయన పేర్కొన్నారు. 1951లో జరిగిన పునర్నిర్మాణం భారత ఆత్మగౌరవానికి ప్రతీక అని, సోమనాథుని దర్శనం సర్వపాప హరణమని ఆయన గుర్తుచేశారు.
News January 5, 2026
మీ గుమ్మానికి ‘స్వస్తిక్’ గుర్తు ఉందా?

స్వస్తిక్ సానుకూల శక్తి, శుభానికి సంకేతం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగి అదృష్టం వరిస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు. స్వస్తిక్ వేసిన చోట పరిశుభ్రత పాటించాలని, అక్కడ బూట్లు, చెప్పులు ఉంచకూడదని అంటున్నారు. ఇది ఎరుపు రంగులో ఉంటే అదృష్టమని, ఇంట్లోకి ప్రతికూల శక్తి రాకుండా నిరోధించవచ్చని సూచిస్తున్నారు. సుఖశాంతులు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని నమ్మకం.
News January 5, 2026
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్లో 50 పోస్టులు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో 50 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు ఎల్లుండి (JAN 7)వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, డిప్లొమా, CA, ICWA, MBA, ME, ఎంటెక్, MSW, MA, PhD(హిందీ), LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అసెస్మెంట్/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.bemlindia.in/


