News October 4, 2024
మరో 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్

దేశంలోని మరో 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరాఠీ, బెంగాలీ, పాళీ, ప్రాకృత, అస్సామీ భాషలకు ఈ స్థాయిని కల్పించనుంది. దీంతో వీటితో కలిపి దేశంలోని సాంప్రదాయ భాషల సంఖ్య 11కు చేరనుంది. ఇప్పటివరకు తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలు మాత్రమే ఈ స్టేటస్‌ను కలిగి ఉన్నాయి.
Similar News
News March 12, 2026
JEE MAIN: దరఖాస్తులకు మరో ఛాన్స్!

జేఈఈ మెయిన్ సెషన్-2కు దరఖాస్తు చేసుకునేందుకు NTA మరో అవకాశం ఇచ్చింది. విద్యార్థుల నుంచి వినతులు రావడంతో రిజిస్ట్రేషన్ల విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది. రేపు రాత్రి 9 గంటల వరకు <
News March 12, 2026
IPL SPL: డిఫెండింగ్ ఛాంపియన్ RCB VS పవర్‌హౌస్ SRH

ఈసారి IPL తొలి పోరులో RCB, SRH జట్లు తలపడనున్నాయి. గత విజయాల ఊపులో RCB ఈజీగా గెలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండగా.. రికార్డులు మాత్రం సన్‌రైజర్స్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటివరకూ జరిగిన 24 మ్యాచుల్లో SRH 13, RCB 11 సార్లు గెలిచాయి. 2024లో 287 పరుగుల రికార్డు స్కోరుతో చెలరేగిన SRH ఈసారి ఏకంగా 300 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగుతుందనే చర్చ సాగుతోంది.
News March 12, 2026
సముద్ర గర్భంలో మృత్యుపాశాలు!

సముద్ర గర్భంలో దాగి ఉండే ‘నావికా దళ మైన్స్’ అత్యంత ప్రమాదకరమైనవి. తాజాగా హార్ముజ్ జలసంధిలో ఇరాన్ వీటిని మోహరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి నౌకలను క్షణాల్లో ధ్వంసం చేయగలవు. ఓడల శబ్దం లేదా అయస్కాంత సెన్సార్ల ద్వారా ఇవి పేలుతాయి. అత్యంత ఆధునికమైన రైజింగ్ టార్పెడో, ఇన్‌ఫ్లుయెన్స్ మైన్స్ శబ్దాన్ని పసిగట్టి దాడులు చేస్తాయి. శత్రువును ముంచడమే కాదు, సముద్ర ప్రయాణాన్నే అసాధ్యం చేయగల సత్తా వీటికి ఉంది.


