News October 4, 2024

రేపటిలోగా డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి: సీఎం

image

TG: ఈనెల 5వ తేదీలోపు అన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఎంపికైన 11,062 మంది అభ్యర్థులకు దసరా పండుగలోపు ఈనెల 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే 9,090 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

Similar News

News October 8, 2024

UAE నుంచి భారత్‌కు $100bns పెట్టుబడులు: పీయూష్ గోయల్

image

రాబోయే సంవత్సరాల్లో UAE నుంచి $100bns పెట్టుబడులను భారత్ ఆకర్షిస్తుందని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి డేటా సెంటర్లు, AI, రెన్యూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్ ఇన్ఫ్రా రంగాల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రోత్సాహకంగా వారికి ఉచితంగా భూములు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఈక్విటీల్లో UAE ప్రత్యక్ష పెట్టుబడులు $20bnsగా ఉన్నాయి. 2023లోనే $3bns వచ్చాయి.

News October 8, 2024

రేపు టీడీపీలో చేరనున్న మోపిదేవి, మస్తాన్‌రావు

image

AP: ఆగస్టు 29న వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రేపు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో పసుపు కండువాలు కప్పుకోనున్నారు. వారివెంట పెద్దఎత్తున అనుచరులు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది. 2019 డిసెంబర్‌లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన మస్తాన్‌రావు ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరనున్నారు.

News October 8, 2024

ప్రభుత్వానికి వైన్ డీలర్ల విజ్ఞప్తి

image

AP: కూటమి ప్రభుత్వానికి ఏపీ వైన్ డీలర్ల సంఘం కీలక విజ్ఞప్తి చేసింది. నూతన మద్యం పాలసీలోని నిబంధనను 21(5) మార్చాలని కోరింది. హైవేలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు పాఠశాలల నుంచి మద్యం షాపులు ఉండాల్సిన నిర్దేశిత దూరాన్ని కాలినడక ఆధారంగా కొలిచే విధానాన్ని తొలగించడాన్ని ఆక్షేపించింది. ఒకే లైనులో కొలత వేయాలన్న నిబంధన షాపుల ఏర్పాటుకు అవాంతరంగా మారుతుందని పేర్కొంది.