News October 4, 2024

బెయిల్ కోరుతూ హైకోర్టులో సజ్జల పిటిషన్

image

AP: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలంతో రాజకీయ కక్షలో భాగంగానే తనను ఇరికించారని వాపోయారు. కోర్టు షరతులకు కట్టుబడి ఉంటానని, బెయిల్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై నేడు కోర్టు విచారణ జరపనుంది.

Similar News

News October 8, 2024

అందరి చూపు ఆ ఇద్దరిపైనే.. గెలుస్తారా?

image

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. 90 సెగ్మెంట్లకు 1,031 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా దేశం మొత్తం ఇద్దరి ఫలితం కోసం ఎదురుచూస్తోంది. పారిస్ ఒలింపిక్స్‌ తర్వాత ఎంతో ఆదరణ పొందిన రెజ్లర్ వినేష్ ఫొగట్‌‌ జులానా నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. మరొకరు భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్ దీపక్ హుడా. ఈయన మెహమ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.

News October 8, 2024

UAE నుంచి భారత్‌కు $100bns పెట్టుబడులు: పీయూష్ గోయల్

image

రాబోయే సంవత్సరాల్లో UAE నుంచి $100bns పెట్టుబడులను భారత్ ఆకర్షిస్తుందని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి డేటా సెంటర్లు, AI, రెన్యూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్ ఇన్ఫ్రా రంగాల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రోత్సాహకంగా వారికి ఉచితంగా భూములు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఈక్విటీల్లో UAE ప్రత్యక్ష పెట్టుబడులు $20bnsగా ఉన్నాయి. 2023లోనే $3bns వచ్చాయి.

News October 8, 2024

రేపు టీడీపీలో చేరనున్న మోపిదేవి, మస్తాన్‌రావు

image

AP: ఆగస్టు 29న వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రేపు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో పసుపు కండువాలు కప్పుకోనున్నారు. వారివెంట పెద్దఎత్తున అనుచరులు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది. 2019 డిసెంబర్‌లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన మస్తాన్‌రావు ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరనున్నారు.