News October 4, 2024

గోవా వెళ్తున్నారా..? సికింద్రాబాద్ నుంచి 2 ట్రైన్లు

image

సికింద్రాబాద్ నుంచి గోవాకు ట్రైన్స్ పెంచాలని ఉన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ క్రమంలో గోవాకు వారానికి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి సికింద్రాబాద్ నుంచి గోవా మధ్య నడుస్తాయి. సికింద్రాబాద్- వాస్కోడగామా రైలు (17039/17040) బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి నడుస్తుంది.

Similar News

News January 15, 2026

HYDలో పోగులేస్తే మటన్‌కు ఎంత ఖర్చంటే!

image

సంక్రాంతి పండుగ వేళ ప్రతి ఇంట్లో తునకలు ఉడకాల్సిందే. మటన్ కిలో రూ.1,000 దాటడంతో సామాన్యులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. 5- 6 కుటుంబాలు కలిసి ఓ మేకను కొని మాంసాన్ని కుప్పలుగా విభజించుకుంటున్నారు. దీంతో ఒక్కో ఫ్యామిలీకి రూ.1,400 వరకు ఖర్చైనా 2KG వరకు మటన్ వస్తుండటంతో ఈ విధానానికి ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఘట్‌కేసర్, మెట్, IBP తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం పోగుల పంపకాలు జోరుగా సాగుతున్నాయి.

News January 15, 2026

HYDలో 3 రోజులు.. సాయంత్రం అలా!

image

పరేడ్ గ్రౌండ్లో కైట్& స్వీట్ ఫెస్టివల్ నేడు ఆఖరిరోజు. నిరాశ చెందకండి రేపటి నుంచి అసలు మజా ఇక్కడే హాట్ ఎయిర్ బెలూన్ షోతో ఉంటుంది. చల్లని సాయంత్రం, చిన్న ఫైర్‌తో రంగుల బెలూన్‌లు ఆకాశంలో ఎగురుతుంటే ఫ్యామిలీ, దోస్తులతో వాటిని చూస్తూ చిల్ అవ్వడం కంటే ఏంకావాలి. ఆకాశంలో ఎగిరే ఈ బెలూన్లు నగరవాసులతో సహా పొరుగు రాష్ట్రాల వారికి మరపురాని అనుభూతిని అందించనున్నాయి. నేడు కైట్ ఫెస్టివల్‌కు భారీగా తరలిరానున్నారు.

News January 15, 2026

సంక్రాంతి వేళ HYDలో DANGER

image

HYDలో ఎయిర్ క్వాలిటీ మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున గాజులరామారంలో 239కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. 2, 3 రోజులుగా వాయు నాణ్యత తగ్గుతూ.. ఇవాళ ప్రమాదకర స్థాయికి చేరింది.