News October 4, 2024

NZB: నేడు నగరానికి రానున్న TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

image

నూతన TPCC అధ్యక్షునిగా నియమింపబడిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం మొదటిసారి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ సభలో పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.

Similar News

News January 13, 2026

బోధన్ శివారులో డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రుద్ర వెంచర్ వద్ద ద్విచక్ర వాహనపై వెళ్తున్న లంగ్డ పూర్ పూర్ గ్రామానికి చెందిన అంజి (38)ని డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

NZB జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: కలెక్టర్

image

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో శుభాలు సమకూరాలని, అనుకున్న కార్యాలన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని అభిలషించారు.