News October 4, 2024

అనంతపురంలో కిలో టమాటా రూ.77

image

అనంతపురం రూరల్‌ కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.77తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్‌ యార్డు కార్యదర్శి రాంప్రసాద్‌ తెలిపారు. మార్కెట్‌కు మంగళవారం మొత్తంగా 630 టన్నుల టమాటా దిగుబడులు వచ్చాయని తెలిపారు. కిలో సరాసరి రూ.67, కనిష్ఠ ధర రూ.51 పలికినట్లు తెలిపారు. టమాటా ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది.

Similar News

News October 4, 2024

ATP: 2,79,161 మందికి రూ.55.83 కోట్లు

image

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 18వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం రేపు నిధులు విడదల చేయనుంది. ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు చొప్పున జమకానుంది. అనంతపురం జిల్లాలో 2,79,161 మందికి రూ.55.83 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా రైతులకు పంట సాయంగా ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే.

News October 4, 2024

బెనిఫిట్స్ త్వరగా వచ్చే విధంగా చూడండి: ఎస్పీ

image

పోలీస్ శాఖలో పనిచేస్తూ చనిపోయిన, పదవి విరమణ పొందిన వారికి రావలసిన బెనిఫిట్స్ త్వరగా అందేలా చూడాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సూచించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో డిపిఓ సిబ్బంది, అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పదవి విరమణ పొందిన వారికి, మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయో వాటి వివరాలు తెలపాలని పేర్కొన్నారు.

News October 3, 2024

100 రోజుల కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాన్ని 30 నాటికి సాధించాలి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర-2047 విజన్‌కు సంబంధించి జిల్లా, మండల కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనకు అధికారులు కృషి చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో వంద రోజులు ప్రణాళికపై, వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో ప్రధాన అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సరించాలన్నారు.