News October 4, 2024
VZM: పైడితల్లి హుండీ ఆదాయం రూ.10.54 లక్షలు

శ్రీ పైడితల్లి అమ్మవారి హుండీల ఆదాయం గత 29 రోజులకు గాను రూ.10,54,690, బంగారం 125.100 గ్రాములు వచ్చింది. గురువారం రెండు ఆలయాల హుండీలను అమ్మవారి కళ్యాణ మండపంలో లెక్కించారు. వెండి 131 గ్రాములు వచ్చినట్లు ఈవో ప్రసాదరావు తెలిపారు. హుండీ లెక్కింపులో పాత రూ.2వేల నోట్లు, రూ.500 నోట్లు, నకిలీ నోట్లు దర్శనమిచ్చాయి. హుండీలో ఇలాంటి నోట్లు వేయకూడదని ఈవో సూచించారు.
Similar News
News October 2, 2025
వేంకటేశ్వర స్వామి నాకు ప్రాణబిక్ష పెట్టారు: చంద్రబాబు

నా పై 24 క్లెమోర్ మైన్స్ పేల్చితే.. సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామే ప్రాణబిక్ష పెట్టారని సీఎం చంద్రబాబు అన్నారు. దత్తిలో ఆయన మాట్లాడుతూ.. ఆ స్వామి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తానన్నారు. ఆనాడు ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని దేవాలయాల్లోనూ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
News October 1, 2025
దత్తి: పీ4ను అమలు చేసిన సీఎం.. యువకుడికి రూ.5లక్షల అందజేత

దత్తిలో నిర్వహించిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు బంగారు కుటుంబాలు, మార్గదర్శిలతో ముఖా ముఖి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ధనుంజయ నాయుడు అనే యువకుడు అనారోగ్య సమస్యతో బాధపడుతూ తన అన్నయ్య పిల్లలకు కూడా తానే దిక్కయ్యానని సీఎంకి వివరించాడు. దీనికి స్పందించిన సీఎం ఆయన ఆరోగ్య ఖర్చుల కోసం రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే స్పందించిన కలెక్టర్ ఆ చెక్కును యువకుడికి అందజేశారు.
News October 1, 2025
విజయనగరం ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన మంత్రులు

ఈనెల 5, 6 తేదీల్లో జరగనున్న విజయనగరం ఉత్సవాల గోడ పత్రికను మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. విజయనగర వైభవాన్ని చాటి చెప్పే విధంగా ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.