News October 4, 2024
HYD: నేడు హైకోర్టులో వైద్య శిబిరం

నిర్మాణ్ సంస్థ, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా ఈరోజు హైకోర్టులో మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ డా.రాకేశ్ సహాయ్ తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు.
Similar News
News January 18, 2026
HYDలో ఆదివారం AQ @189

HYDలో ఎయిర్ క్వాలిటీ గత వారంతో పోలిస్తే స్వల్పంగా మెరుగుపడింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూ వస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ నగరంలో ఆదివారం తెల్లవారుజామున 189గా నమోదైంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు మాస్కులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వాహనాల రద్దీ, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ తగ్గడంతో HYD ఊపిరితీసుకుంటోంది.
News January 18, 2026
HYD మెట్రో.. త్వరలో సీఎం ముందుకు ఫైనాన్స్ రిపోర్ట్..?

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును సర్కారు స్వాధీనం చేసుకునే క్రమంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన ఆడిట్ పూర్తిచేసినట్లు సమాచారం. మరో పది రోజుల్లో ఈ కమిటీ తన నివేదికను సీఎం వద్దకు పంపనున్నట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా మెట్రో రైల్ హక్కుల స్వాధీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఏదేమైనా ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా ముగించాలని సర్కార్ భావిస్తోంది.
News January 18, 2026
HYDలో విమానాల న్యూమాయిష్.. ఎక్కడంటే..?

నగరం మరో ప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఈనెల 28 నుంచి నాలుగు రోజుల పాటు విమానాల ప్రదర్శన నిర్వహించనున్నారు. వింగ్స్ ఇండియా పేరిట నిర్వహించే ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖ కంపెనీలు తమ విమానాలను ప్రదర్శననున్నాయి. మొదటి రెండు రోజులు బిజినెస్ పీపుల్‌కు, తరువాతి రెండు రోజులు సిటీ ప్రజలకు విమానాలను చూసే అవకాశం ఇవ్వనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఈ విమానాల ఎగ్జిబిషన్ ఉంటుంది.


