News October 4, 2024

సోదరి నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు: CM రేవంత్

image

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ ఉద్యోగాన్నిచ్చింది. తాజాగా ఆమెకు రేవంత్ లాఠీని బహూకరించారు. ‘పేదరికాన్ని జయించి, సమానత్వాన్ని సాధించి, విశ్వక్రీడా వేదికపై తెలంగాణ కీర్తి పతాకను ఎగరేసి, నేడు ప్రజా ప్రభుత్వంలో డీఎస్పీగా నియమితులైన సోదరి నిఖత్ జరీన్‌కు హార్దిక శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.

Similar News

News February 1, 2026

ట్యాక్స్ పేయర్స్‌కు పెద్ద ఉపశమనం

image

ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) రివైజ్ చేసుకోవాలనుకునే వారికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మంచి వెసులుబాటు కల్పించారు. తక్కువ ఫీజుతో మార్చి 31 వరకు గడువు పొడిగించారు. అయితే, ITR-1, 2 ఫైల్ చేయడానికి మాత్రం యథావిధిగా జులై 31 చివరి తేదీగా ఉంటుంది. ఇక విదేశీ టూర్ ప్యాకేజీలపై TCSను 2%గా నిర్ణయించారు. త్వరలోనే సరళీకరించిన కొత్త టాక్స్ రూల్స్ కూడా రాబోతున్నాయి.

News February 1, 2026

దేశ పురోగతికి ఆరు సూత్రాలు

image

ప్రపంచ పరిణామాలను అందిపుచ్చుకొంటూ దేశం మరింత ముందుకు సాగేలా కేంద్రం బడ్జెట్లో ఆరు సూత్రాలను ప్రకటించింది.
1. వ్యూహాత్మక రంగాల్లో మాన్యుఫ్యాక్చరింగ్‌ పెంచడం
2. పారిశ్రామిక వారసత్వ పునరుద్ధరణ
3. MSMEలను ఛాంపియన్లుగా మార్చడం
4 మౌలిక సదుపాయాలకు మరింత ప్రోత్సాహం
5 దీర్ఘకాలిక స్థిర భద్రతను కల్పించడం
6 సిటీ ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధి.

News February 1, 2026

ఇంటర్వ్యూతో ICSILలో ఉద్యోగాలు

image

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<>ICSIL<<>>)8 డేటా ఎంట్రీ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 10న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఇంటర్వ్యూకు ఒక రోజు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590. నెలకు రూ.24,356 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://icsil.in