News October 4, 2024
ప్రతి రైతుకి యూనిక్ ఐడీ కార్డు.. వ్యవసాయ శాఖ కసరత్తు

APలోని రైతులందరికీ యూనిక్ ఐడీ కార్డులు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. కేంద్రం తెచ్చిన ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ-పంట కోసం రైతుల ఆధార్‌ను వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానించారు. ఈ నేపథ్యంలో ID కార్డుల జారీ ప్రక్రియ సులభంగా పూర్తి చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 50 లక్షల మంది రైతులుండగా, 1.90 లక్షల మంది అటవీ భూముల రైతులనూ ఇందులోకి తెస్తున్నారు.
Similar News
News December 29, 2025
భిక్షమెత్తుతూ ఆలయానికి రూ.లక్ష, అన్నదానం

AP: సేవాగుణానికి చేసే పనితో సంబంధం ఉండదని నిరూపిస్తున్నారు గొర్ర నరసయ్యమ్మ(70). తిరుపతికి చెందిన ఆమె 42 ఏళ్ల క్రితం తునికి వచ్చారు. స్థానికంగా అమ్మవారి ఆలయం వద్ద యాచకురాలిగా జీవనం సాగిస్తున్నారు. సొంతవారు వదిలేయడంతో తన సంపాదనలో కొంత అన్నదానానికి బియ్యం బస్తాలు ఇవ్వడమే కాకుండా ₹లక్షను అమ్మవారి ఆలయానికి విరాళంగా ఇచ్చారు. దీంతో భిక్షమెత్తుతూ ఆమె చేస్తున్న సేవపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News December 29, 2025
సాగులో సాంకేతిక పరిజ్ఞానం.. కులవృత్తులపై ప్రభావం

వ్యవసాయంలో యాంత్రీకరణ సాగును లాభసాటిగా మార్చినప్పటికీ.. ఈ సాంకేతిక పరిజ్ఞానం కొన్ని చేతి వృత్తుల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చివేసింది. నాగలి, ఎడ్లబండి చక్రాలు, పట్టి వేయడం, దంతె, గొర్రు, మేడి వంటి పనిముట్లను తయారు చేస్తూ అనేక మంది జీవించేవారు. ట్రాక్టర్లు, ఇతర యంత్రాల వినియోగం పెరగడంతో వీటిని వాడే రైతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఫలితంగా కొన్ని కులవృత్తులకు ఉపాధి కరవయ్యే పరిస్థితి నెలకొంది.
News December 29, 2025
నష్టాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో 26,018 వద్ద, సెన్సెక్స్ 104 పాయింట్లు కుంగి 84,936 వద్ద ఉన్నాయి. టాటా స్టీల్, ఎటర్నల్, టైటాన్, టెక్ మహీంద్రా, TMPV షేర్లు లాభాల్లో.. అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, HCL టెక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.


