News October 4, 2024

Stock Marketలో యుద్ధ కల్లోలం.. నేడెలా మొదలయ్యాయంటే?

image

స్టాక్ మార్కెట్లు రేంజుబౌండ్లో ట్రేడవుతున్నాయి. నిన్నటి క్రాష్‌తో పోలిస్తే నేడు మోస్తరు నష్టాల్లోనే సూచీలు ఆరంభమయ్యాయి. విలువైన షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. BSE సెన్సెక్స్ 82,479 (-17), NSE నిఫ్టీ 25,237 (-12) వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీలో 24 కంపెనీలు లాభాల్లో, 25 నష్టాల్లో ఉన్నాయి. మారుతీ, ONGC, టైటాన్, SBI లైఫ్, BEL టాప్ గెయినర్స్.

Similar News

News January 28, 2026

కేరళ బస్సు వివాదం.. షింజితా ముస్తఫా బెయిల్ పిటిషన్ తిరస్కరణ

image

కేరళలోని ఓ బస్సులో దీపక్‌ అనే వ్యక్తిపై లైంగిక ఆరోపణలు చేసి అతని <<18917671>>ఆత్మహత్యకు<<>> కారణమైన షింజితా ముస్తఫాకు కోజికోడ్ కోర్టు షాకిచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రస్తుతం సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వీడియోను అప్‌లోడ్ చేసిన ఫోన్‌ను సైంటిఫిక్ అనాలసిస్‌కు పంపామన్నారు. ఈ దశలో ఆమెను విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న వాదనలతో కోర్టు ఏకీభవించింది.

News January 28, 2026

నేడు..

image

☕AP క్యాబినెట్ భేటీ
☕ఢిల్లీలో కేంద్రమంత్రులతో AP డిప్యూటీ సీఎం పవన్ భేటీ
☕భీమవరం ముఖ్య నేతలతో జగన్ సమావేశం
☕అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం
☕మేడారం జాతర షురూ.. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు
☕మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలు
☕మెదక్ జిల్లాలో మీనాక్షి, మహేశ్ గౌడ్ పర్యటన
☕ఢిల్లీలో NCC ర్యాలీ, పాల్గొననున్న ప్రధాని
☕వైజాగ్‌లో భారత్-న్యూజిలాండ్ నాలుగో T20

News January 28, 2026

బాయ్‌కాట్ లీకులు.. పాక్‌కు భారీ షాక్ తప్పదా?

image

T20WCలో ఇండియాతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ పీసీబీ ఛైర్మన్ నఖ్వీ లీకులు ఇస్తున్నారు. అయితే ఇదే జరిగితే ఆ దేశంపై $38 మిలియన్ల దావా వేసేందుకు బ్రాడ్‌కాస్టర్ సిద్ధమవుతోంది. ఎంతో క్రేజ్ ఉండే INDvsPAK మ్యాచ్ కోసం ఇప్పటికే భారీగా అడ్వర్‌టైజింగ్ స్లాట్లు, స్పాన్సర్‌షిప్స్ బుక్కయ్యాయి. ఒకవేళ బాయ్‌కాట్ ప్రకటన వస్తే నష్టం మొత్తాన్ని వసూలు చేస్తామని బ్రాడ్‌కాస్టర్ వర్గాలు పేర్కొన్నాయి.