News October 4, 2024
రుణమాఫీపై సీఎం చెప్పినవన్నీ డొల్లమాటలే: KTR

వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని కేటీఆర్ విమర్శించారు. ‘20 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైంది. ఓవైపు DEC 9న ఏకకాలంలో చేస్తామని దగా. మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం. అనధికారికంగా ఇంకా రుణమాఫీ కాని రైతులెందరో? సీజన్ ముగిసినా రైతుబంధు ఇవ్వలేదు. రాబందుల ప్రభుత్వంతో రైతులకేం లాభం’అని ట్వీట్ చేశారు.
Similar News
News March 19, 2026
‘ఉస్తాద్ భగత్ సింగ్’ పబ్లిక్ టాక్

డైరెక్టర్ హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్ అభిమానులను అలరించేలా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను తెరకెక్కించారని బెనిఫిట్ షో చూసిన పలువురు ప్రేక్షకులు తెలిపారు. పదునైన మాస్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయన్నారు. పవన్ ఎనర్జీ, డాన్సులు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయని పేర్కొన్నారు. కథలో కొత్తదనం లేకపోవడం నిరాశ పరుస్తుందని మరికొందరు అన్నారు. కాసేపట్లో Way2News రివ్యూ&రేటింగ్.
News March 19, 2026
ఆ ఒక్క థియేటర్‌లోనే పార్కింగ్ ఫీజు రద్దు

TG: సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ నిషేధం కేవలం పిటిషనర్ పేర్కొన్న కోణార్క్(HYD) థియేటర్‌కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. పార్కింగ్ ఫీజుకు అనుమతినిచ్చే GO 121 చట్టబద్ధతపై సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని సూచించింది. దీంతో ఇతర థియేటర్ల యాజమాన్యాలకు పెద్ద ఊరట లభించినట్లయింది.
News March 19, 2026
చెరువు మట్టితో చాలా లాభాలున్నాయ్

చెరువులోని పూడిక మట్టిని పొలంలో వేస్తే భూమికి, పంటకు చాలా మేలు జరుగుతుంది. చెరువులో నీరు నిల్వ ఉన్నప్పుడు ఆకులు, గడ్డి వ్యర్థాలు కుళ్లి మట్టిలో చేరతాయి. వేసవిలో చెరువులు అడుగంటుతాయి. అప్పుడు చెరువు మట్టిని పొలాల్లో వేస్తే నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు, బోరాన్, సేంద్రియ కర్భన పదార్థాలతో పాటు.. మొక్కల పెరుగుదలకు కావాల్సిన సూక్ష్మ జీవులు, పంటకు మేలు చేసే మిత్ర పురుగులు నేలలో వృద్ధి చెందుతాయి.


