News October 4, 2024

4 నెలలుగా పాక్ క్రికెటర్లకు జీతాల్లేవ్

image

పాకిస్థాన్ క్రికెట్ తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. బంగ్లా చేతిలో ఓటమి, కెప్టెన్సీ నుంచి బాబర్ వైదొలగడం, బోర్డులో మార్పులతో గందరగోళం కొనసాగుతోంది. 4 నెలలుగా ఉమెన్స్, మెన్స్ ప్లేయర్లకూ జీతాలు అందడం లేదనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 25 మంది సెంట్రల్ కాంట్రాక్ట్ 2026 వరకు ఉండగా, త్వరలోనే సమీక్షించనున్నట్లు సమాచారం. జెర్సీలపై లోగో స్పాన్సర్‌షిప్ పేమెంట్లూ రావట్లేదని తెలుస్తోంది.

Similar News

News September 14, 2025

సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు

image

AP: సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దైంది. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఏవియేషన్ అధికారుల నుంచి క్లియరెన్స్ వస్తే సీఎం తిరుపతి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఇవాళ సీఎం పాల్గొనాల్సి ఉంది.

News September 14, 2025

స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో జాబ్‌లు

image

<>ఇస్రో <<>>అనుబంధ సంస్థ స్పేస్ అప్లికేషన్ సెంటర్ 13 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీటెక్/బీఈ, పీజీ, ఎంటెక్/ఎంఈ, పీహెచ్‌డీ‌తో పాటు పని అనుభవం గల అభ్యర్థులు సెప్టెంబర్ 22వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35ఏళ్లు. వెబ్‌సైట్: https://careers.sac.gov.in/

News September 14, 2025

GREAT: పసిపాపతో ఇంటర్వ్యూకు హాజరై.. DSPగా

image

మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూకు ఓ మహిళ తన చంటిపాపతో హాజరయ్యారు. మైహర్ జిల్లాకు చెందిన వర్షా పటేల్ గర్భవతిగా ఉన్నప్పుడు MPPSC పరీక్షలు రాసి స్టేట్ 11th ర్యాంక్ సాధించారు. ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు తన 20రోజుల కుమార్తె శ్రీజను ఒడిలో కూర్చోపెట్టుకున్నారు. ఇటీవల వెలువడిన ఫైనల్ ఫలితాల్లో ఆమె DSP ఉద్యోగానికి ఎంపికయ్యారు. వర్ష గతంలో 5సార్లు పరీక్షలు రాసి, 3సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు.