News October 4, 2024

కడప: అధికారుల పేరుతో నగదు వసూలు.. తస్మాత్ జాగ్రత్త

image

కడప జిల్లాలో ఉన్నతాధికారుల పేరుతో సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు వసూళ్లకు పాల్పడుతున్నాడని, అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శివ శంకర్ సూచించారు. ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల పేరు, ఫోటో పెట్టి వాట్సాప్ ఖాతాను సైబర్ నేరగాళ్లు సృష్టించి అత్యవసరంగా డబ్బు పంపాలని మెసేజ్‌లు పంపిస్తున్నారన్నారు.
ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు ఎవరూ డబ్బు కానీ పంపాలని ఎప్పుడు అడగరనేది తెలిపారు.

Similar News

News March 20, 2026

సిద్ధవటంలో కనిపించిన నెలవంక.. రేపే రంజాన్

image

సిద్ధవటంలో శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం రంజాన్ పర్వదినం (ఈదుల్ ఫితర్) జరుపుకోనున్నారు. ఉదయం 10.15 గంటలకు సిద్ధవటం శివారులోని ఈద్గాలో జమాఅత్ ప్రారంభమై అనంతరం ప్రత్యేక నమాజ్ నిర్వహించనున్నట్లు ముత్తవల్లి సయ్యద్ నజరే ఆలం ఖాద్రి తెలిపారు. నెల రోజుల పాటు ముస్లింలు పాటించిన కఠోర ఉపవాసాలు నేటితో ముగిశాయని ఆయన పేర్కొన్నారు.

News March 20, 2026

రైతుల నుంచి అధికంగా వసూలు చేస్తే చర్యలు: జ్యోతి

image

ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల్లో రైతుల నుంచి క్వింటాలుకు రూ.75లు మించి వసూలు చేస్తే ఇన్‌ఛార్జ్‌లపై చర్యలు తీసుకుంటామని మార్క్ ఫెడ్ డీఎం పరిమళ జ్యోతి హెచ్చరించారు. ప్రొక్యూర్ మెంట్ కేంద్రాల్లో రైతులందరికీ బహిరంగంగా కనిపించేలా ఛార్జీల వివరాలను, ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నెంబర్లను ప్రదర్శించాలన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

News March 20, 2026

కడప: Way2News ఎఫెక్ట్.. ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లలో దోపిడీకి తెర.!

image

కడప జిల్లాలో మార్క్‌ఫెడ్ 21 పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటిని DCMS నిర్వహిస్తోంది. ఇక్కడి ఇన్‌ఛార్జ్‌లు రైతుల నుంచి బస్తాకు రూ.150-200లు దోపిడీ చేస్తున్నారు. దీనిపై Way2Newలో వీడియోలతో సహా వరుస కథనాలు ప్రచురించింది. దీంతో శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల్లో క్వింటాలకు రూ.75లు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు.