News October 4, 2024

లడ్కీ బెహన్ ఓకే గానీ వారిపై నేరాల సంగతేంటి: పవార్

image

మహాయుతి ప్రభుత్వం తీసుకొచ్చిన లడ్కీ బెహన్ స్కీమ్‌తో మహిళలకు లబ్ధి కలుగుతున్నా మరోవైపు వారిపై అఘాయిత్యాలు పెరిగాయని NCP SCP నేత శరద్ పవార్ అన్నారు. సోషల్ మీడియాలో పలు అంశాలపై స్పందించారు. గణేశ్ పూజకోసం CJI ఇంటికి PM వెళ్లడంపై మాట్లాడేందుకు నిరాకరించారు. వారివి అత్యున్నత పోస్టులని, వాటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉందని పేర్కొన్నారు. MVA సీట్ల పంపకాల చర్చల్లో తాను పాల్గొనడం లేదన్నారు.

Similar News

News October 4, 2024

గోళ్లను బట్టి ఆరోగ్యాన్ని చెప్పొచ్చు: పోషకాహార నిపుణులు

image

గోళ్లు చూసి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయొచ్చని న్యూట్రీషనిస్ట్ సిమ్రున్ చోప్రా చెబుతున్నారు. ‘సన్నగా, మెత్తగా ఉండే గోళ్లు విటమిన్ బి, కాల్షియం, ఐరన్ లోపానికి సూచన కావొచ్చు. స్పూన్‌లా మధ్యలో గుంట పడినట్లుగా ఉండే గోళ్లు రక్తహీనత, లివర్ సమస్యలను, తెల్ల మచ్చలుండే గోళ్లు జింక్ లోపాన్ని సూచిస్తుండొచ్చు. అధిక ధూమపానానికి, థైరాయిడ్, శ్వాసకోశ సమస్యలకు పసుపు రంగు గోళ్లు సూచన కావొచ్చు’ అని వివరించారు.

News October 4, 2024

ఆ దాడులు చట్టబద్ధమైనవే: ఇరాన్ సుప్రీం ఖమేనీ

image

ఇజ్రాయెల్‌పై ఇస్లామిక్ రిపబ్లిక్ దేశాల దాడులు చట్టబద్ధమైనవని ఇరాన్ సుప్రీం లీడ‌ర్‌ ఖమేనీ పేర్కొన్నారు. ఐదేళ్ల త‌రువాత ఆయ‌న బ‌హిరంగ ఉప‌న్యాసం ఇచ్చారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి కూడా చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన‌దిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. అఫ్గానిస్థాన్ నుంచి యెమెన్ వరకు, ఇరాన్ నుంచి గాజా, లెబనాన్ వరకు దురాక్ర‌మ‌ణులను తిప్పికొట్టేందుకు ముస్లిం దేశాలు భ‌ద్ర‌త‌ను ప‌టిష్ఠం చేసుకోవాల‌న్నారు.

News October 4, 2024

చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది: జగన్

image

AP: తిరుమల లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఎత్తిచూపిందని వైసీపీ చీఫ్ నేత జగన్ అన్నారు. ‘ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మతవిశ్వాసాలను రాజకీయ దుర్బుద్ధితో రెచ్చగొడుతున్నారని సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. అందుకే దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దని గట్టిగా స్పందించింది’ అని మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు.