News October 4, 2024
వరంగల్: తగ్గిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు తగ్గాయి. వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.15,500 ధర రాగా.. నేడు రూ.15వేలకి తగ్గింది. అలాగే తేజమిర్చికి నిన్న రూ.18,500 ధర రాగా నేడు రూ.18వేల ధర వచ్చింది. మరోవైపు 341 రకం మిర్చి రూ.15,800 ధర పలకగా నేడు రూ.15 వేలకు పడిపోయింది.
Similar News
News December 28, 2025
WGL: రేపు కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఉ.10.30 గంటలకు ప్రారంభం కానుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలను నేరుగా అధికారులకు అందించొచ్చన్నారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ వేదిక ఎంతో దోహదపడుతుందని కలెక్టర్ వివరించారు.
News December 28, 2025
వరంగల్: రేపటి నుంచే ‘యూరియా యాప్’ అమలు

వరంగల్ జిల్లాలో యూరియా పంపిణీని మరింత పారదర్శకం చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. రేపటి నుంచి జిల్లావ్యాప్తంగా యూరియా యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉన్న రైతులు గూగుల్ ప్లే స్టోర్‌లో ‘Fertilizer Booking App’ అని టైప్ చేసి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. యూరియా సరఫరాలో జాప్యాన్ని నివారించొచ్చని ఆమె పేర్కొన్నారు.
News December 28, 2025
వరంగల్ జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

జిల్లాలో గత ఆదివారంతో పోలిస్తే నేడు చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు చికెన్ విత్ స్కిన్ కేజీకి రూ.250 నుంచి రూ.270 పలకగా.. స్కిన్ లెస్ కేజీకి రూ.280 నుంచి రూ.300 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.170-రూ.180 ధర ఉంది. సిటీతో పోలిస్తే పల్లెటూరులో రూ.10-20 ధర వ్యత్యాసం ఉంది. ధరలు పెరగడంతో కొనుగోలు స్వల్పంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.


