News October 4, 2024
సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: వైవీ, భూమన

AP: తిరుపతి లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని TTD మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నామని చెప్పారు. సిట్ దర్యాప్తుతో నిర్దోషులను దోషులుగా చూపించే అవకాశం ఉందనే అనుమానాలతో దానిని వ్యతిరేకించామన్నారు. తాను ఛైర్మన్‌గా ఉన్నప్పుడు AR కంపెనీ నెయ్యి సప్లై చేయలేదని వైవీ స్పష్టం చేశారు.
Similar News
News January 25, 2026
పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ సన్మానం

TG: పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులకు CM రేవంత్ రెడ్డి సన్మానం నిర్వహించనున్నారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ లభించగా, పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం తిరిగి వచ్చిన అనంతరం ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గతేడాది కూడా పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించారు.
News January 25, 2026
టీమ్ ఇండియా ఘన విజయం

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించింది. సంజూ డకౌటైనా అభిషేక్(68*), సూర్యకుమార్(57*) ధాటిగా ఆడారు. పవర్ ప్లే ముగిసేలోపే అభిషేక్ ఫిఫ్టీ నమోదు చేశారు. ఇషాన్(28) సైతం ధనాధన్ ఇన్నింగ్సు ఆడారు. ఈ విజయంతో 5 T20Iల సిరీస్‌ను 3-0తో టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. మరో 2 టీ20లు నామమాత్రం కానున్నాయి.
News January 25, 2026
అభిషేక్ శర్మ ఊచకోత..

న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడో టీ20లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నారు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. భారత్ తరఫున టీ20లలో ఇదే సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. తొలి స్థానంలో అభిషేక్ గురువు యువరాజ్(12 బంతుల్లోనే అర్ధ సెంచరీ) ఉన్నారు.


