News October 4, 2024

తండ్రి ప్రేమ.. ప్రాణాలకు తెగించి కూతురి కోసం..!

image

తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ప్రత్యేక బంధం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కూతురి సంతోషం కోసం తండ్రి ఎంతైనా కష్టపడుతుంటాడు. అలాంటి ఓ తండ్రి తన కూతురి పెళ్లి కోసం ఏకంగా 50kms నడిచారు. హెలెన్ హరికేన్ USలో విధ్వంసం సృష్టించింది. వరదలు ముంచెత్తి రాకపోకలు నిలిచిపోయాయి. అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ తండ్రి జోన్స్ సౌత్ కరోలినా నుంచి కూతురు ఎలిజబెత్ పెళ్లి జరిగే జాన్సన్ సిటీకి 12 గంటల్లో చేరుకున్నారు.

Similar News

News October 4, 2024

మనకు ‘ఐరన్ డోమ్’ తరహా రక్షణ కీలకం: వాయుసేన చీఫ్

image

రక్షణ విషయంలో భారత్‌కూ ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ తరహా రక్షణ వ్యవస్థలు కీలకమని వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘ఇప్పటికే మనం ఐరన్ డోమ్‌వంటివి కొంటున్నా అవి సరిపోవు. దేశంలోని కీలక ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థల్ని మోహరించాలి. గగనతల దాడుల్ని తక్కువ అంచనా వేయకూడదు. ఆయుధ సరఫరా గడ్డు పరిస్థితుల్లో ఉన్నా భారత్ మేనేజ్ చేస్తోంది. నిరంతరం యుద్ధ సన్నద్ధతతో ఉండటం మనకు అత్యవసరం’ అని పేర్కొన్నారు.

News October 4, 2024

అభిమానులకు రజినీకాంత్ సందేశం

image

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తన కుటుంబసభ్యులు, సన్నిహితులు, సహచర నటులు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మీ ప్రార్థనలే తనకు శ్రీరామరక్షగా నిలిచాయని పేర్కొన్నారు. కాగా రజినీ నటించిన ‘వేట్టయన్’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News October 4, 2024

అవసరమైతే ఒక పథకాన్ని ఆపి రైతు హామీలు నెరవేరుస్తాం: మంత్రి తుమ్మల

image

TG: రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రైతులు ఆదరిస్తేనే తాము అధికారంలోకి వచ్చామని మీడియా సమావేశంలో చెప్పారు. అవసరమైతే ఏదైనా పథకాన్ని ఆపి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. కచ్చితంగా రూ.2 లక్షలవరకు రుణమాఫీ చేస్తామన్నారు. అన్ని సబ్సిడీ పథకాలను పునరుద్ధరిస్తామని తెలిపారు.