News October 4, 2024

ఇండియాలో మరో నాలుగు యాపిల్ రిటైల్ స్టోర్స్

image

ఇండియాలో మరో 4 రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఇప్పటివరకూ ముంబై, ఢిల్లీలోనే యాపిల్‌కు చెందిన రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది బెంగళూరు, పుణే, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబైలో మరో నాలుగు స్టోర్స్ ఓపెన్ చేయనున్నట్లు పేర్కొంది. ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. మేడ్-ఇన్-ఇండియా iPhone 16 Pro, Pro Maxల సరఫరా ఈనెల నుంచి ప్రారంభంకానుంది.

Similar News

News April 2, 2026

ఎవరెస్ట్ ట్రెక్కింగ్‌లో భారీ స్కామ్.. ఎలా చేశారంటే?

image

ఎవరెస్ట్ పర్వతారోహణలో కొందరు షెర్పాలు, ఏజెన్సీలు రెస్క్యూ పేరుతో స్కామ్స్‌కు పాల్పడుతున్నట్లు తేలింది. ట్రెక్కర్ల ఆహారంలో కావాలనే బేకింగ్ సోడా అధికంగా వాడి వారిని అనారోగ్యానికి గురిచేస్తున్నట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. అనంతరం రెస్క్యూ పేరిట వారిని హెలికాప్టర్లలో తరలిస్తూ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి మూడేళ్లలో రూ.180 కోట్లకు పైగా క్లెయిమ్ చేసినట్లు చెప్పారు. ఈ స్కామ్‌పై విచారణ కొనసాగుతోంది.

News April 2, 2026

ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడరు: ఇరాన్

image

శత్రువు కదలికలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని, అటాక్ చేస్తే ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలని తమ దళాలకు ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ ఆదేశాలిచ్చారు. తమ దేశంపై గ్రౌండ్ ఆపరేషన్‌కు దిగితే ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడరని హెచ్చరించారు. ఎలాంటి దాడినైనా దీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఇరాన్‌లో భూతల దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

News April 2, 2026

పోలవరంలో కీలక ఘట్టం పూర్తి: చంద్రబాబు

image

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 1,372 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో డీ-వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.వెయ్యి కోట్లు వెచ్చించి నిర్మించామన్నారు. దీంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ECRF) డ్యామ్ పనులు వేగవంతం అవుతాయని వెల్లడించారు. 2027 పుష్కరాలకు ముందే పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.