News October 4, 2024
జగన్‌తో దీక్ష చేయించగలరా?: భూమనకు బీజేపీ నేత సవాల్
AP: పవన్ కళ్యాణ్ దీక్షపై విమర్శలు చేయడం సరికాదని బీజేపీ నేత భాను ప్రకాశ్ ఫైర్ అయ్యారు. పవన్‌ను స్వామి అని సంభోధించిన భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన పార్టీ అధినేతతో భూమన దీక్ష చేయించగలరా? అని సవాల్ విసిరారు. హిందూ సంప్రదాయాల ప్రకారం జగన్‌తో ఇంట్లో పూజలు చేయించగలిగే సత్తా భూమనకు ఉందా అని ప్రశ్నించారు. హిందూ మత విశ్వాసాలను గౌరవించని వ్యక్తి జగన్ అని విమర్శించారు.
Similar News
News December 22, 2024
ప్రశ్నార్థకంగా MVA మనుగడ!
మహారాష్ట్రలో విపక్ష మహా వికాస్ అఘాడీ మనుగడ ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల వల్ల సొంత బలం కోల్పోయామన్న భావనలో 3 పార్టీలున్నాయి. ముఖ్యంగా శివసేన UBT ముంబై నగరంలో తన ప్రాభవాన్ని కోల్పోయింది. దీంతో పునర్వైభవం కోసం కూటమికి దూరం జరుగుతోంది. 2025లో జరగనున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది.
News December 22, 2024
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు దరఖాస్తులు
AP: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు రేపటి నుంచి ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. టెన్త్‌లో సబ్జెక్టుకు రూ.5తోపాటు ఎగ్జామ్ ఫీజు రూ.95, ఇంటర్‌లో సబ్జెక్టుకు రూ.5తోపాటు పరీక్ష ఫీజు రూ.150 చొప్పున చెల్లించాలన్నారు. సబ్జెక్టుకు రూ.25 ఫైన్‌తో జనవరి 4 వరకు, రూ.50 అపరాధ రుసుముతో 8వ తేదీ వరకు అవకాశం ఉంటుందని చెప్పారు.
News December 22, 2024
పోలింగ్ బూత్ వీడియోలు ఇవ్వడం కుదరదు: ఈసీ
ఎన్నికల నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వడం ఇకపై కుదరదని స్పష్టం చేసింది. అభ్యర్థులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే డాక్యుమెంట్ల పరిధిలోకి సీసీటీవీ ఫుటేజీ రాదని పేర్కొంది. నిబంధనల సవరణపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ సర్కారు, ఈసీ కలిసి ఎన్నికల్లో పారదర్శకతను తొలగిస్తున్నారని విమర్శించింది.