News October 4, 2024
రేవంత్ మొనగాడు కాదు.. మోసగాడు: హరీశ్

TG: దేవుళ్లపై ఒట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ మొనగాడు కాదు, మోసగాడని BRS మాజీ మంత్రి, MLA హరీశ్‌రావు విమర్శించారు. కుంటిసాకుతో రుణమాఫీ ఎగ్గొట్టి, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. దసరాలోపు రైతుబంధు పడకపోతే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని అన్నారు.
Similar News
News November 2, 2025
లండన్ పర్యటనలో CM చంద్రబాబు దంపతులు

AP: CM చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి లండన్ పర్యటనకు వెళ్లారు. ఈనెల 5 వరకు ఈ వ్యక్తిగత పర్యటన కొనసాగనుంది. ఈనెల 4న భువనేశ్వరి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందుకోనున్నారు. గతంలో ఈ అవార్డును అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా అందుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ తరఫున గోల్డెన్ పీకాక్ పురస్కారాన్నీ స్వీకరించనున్నారు. అనంతరం CM చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలను CII సదస్సుకు ఆహ్వానిస్తారు.
News November 2, 2025
తిరుమలలో ఘనంగా కైశిక ద్వాదశి ఆస్థానం

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి వాహన సేవను నిర్వహించనున్నారు. మలయప్పస్వామి శ్రీదేవీ, భూదేవీ సమేతంగా మాడ వీధుల్లో ఊరేగనున్నారు. ఈ వాహన సేవ ఉ.6-7.30 గంటల మధ్య జరగనుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.
News November 2, 2025
శుభ కార్యాలు చేసేటప్పుడు పట్టు వస్త్రాలను ఎందుకు ధరించాలి?

శుభకార్యాలు చేసేటప్పుడు పట్టు వస్త్రాలు ధరించడానికి వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. సృష్టిలో ప్రతి ప్రాణి చుట్టూ ‘ఓరా’ అనే సప్తవర్ణ కాంతి పుంజం ఉంటుందట. పట్టు వస్త్రాలు ధరించినప్పుడు ఇది మరింత శక్తివంతంగా మారుతుందట. పట్టు వస్త్రాలు చుట్టూ ఉన్న ఈ సానుకూల శక్తిని ఆకర్షించి, మన శరీరమంతటా ప్రసరించేలా చేస్తుందట. అందుకే పెళ్లిళ్లు, పూజాది క్రతువులు, దేవాలయ దర్శనాల్లో పట్టు వస్త్రాలు ధరించడం ఆనవాయితీ.


