News October 4, 2024
ప్రకాశం: ‘ఇసుక తవ్వకాలకు అనుమతులు తప్పనిసరి’

ప్రకాశం జిల్లాలో ఇసుక భూములకు సంబంధించి పట్టాదారులు, డీకేటీ పట్టాదారులు ఇసుక తవ్వకాల అనుమతి కోసం తరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలులోని కలెక్టెట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. వాగులు, వంకల్లో ఇసుక తవ్వకాలు, రవాణా సంబంధిత సరిహద్దు గ్రామాల పరిధిలో జరగాలన్నారు. ప్రక్రియకు స్థానిక వీఆర్ఓ, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు బాధ్యత వహించాలన్నారు.
Similar News
News September 15, 2025
ప్రకాశం ఎస్పీ మీకోసంకు 58 ఫిర్యాదులు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 58 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ ఉన్నతాధికారులు, మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీకోసంకు వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు.
News September 15, 2025
ప్రకాశంలో ఇంజినీర్ల అద్భుతానికి నిదర్శనం ఇదే!

ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నుంచి నంద్యాల వరకు 60 కి.మీ రహదారి ఉంది. ఇందులో 25 కి.మీ ప్రయాణం ఘాట్ రోడ్డులో ఉంటుంది. స్వాతంత్ర్యం రాకముందు నిర్మించిన రైల్వే పురాతన వంతెనల దిమ్మెలు నేటికీ కనిపిస్తున్నాయి. నాటి ఇంజినీర్ల ప్రతిభకు ఈ ఘాట్ రోడ్డు అద్భుతమైన నిదర్శనంగా నిలుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఇంజినీర్లు సృష్టించిన అద్భుతాలకు ఇదో ఉదాహరణ.
News September 15, 2025
మోక్షగుండం విశ్వేశ్వరయ్య మన జిల్లా వాసే

నేడు ఇంజనీర్స్ డే. దేశమంతా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్మరిస్తుంది. ఇంజినీర్లందరూ ఆయనే ఆదర్శమని గర్వంగా చెబుతుంటారు. ఆయన జయంతి సందర్భంగానే ఇంజినీర్స్ డేను జరుపుకుంటారు. విశ్వేశ్వరయ్య పూర్వీకులు బి.పేట మండలంలోని మోక్షగుండం వాసులే. ఈయనను మోక్షగుండం ప్రజలు నేటికీ ఆరాధిస్తారు. ముంబై, పూణే, హైదరాబాద్లో వంతెనలు నిర్మించి వరదల నుంచి కాపాడిన ఘనత ఈయన సొంతం.