News October 4, 2024

వారం రోజులకు ‘దేవర’ కలెక్షన్లు ఎంతంటే?

image

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. గత నెల 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.405 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేయగా ప్రకాశ్ రాజ్, సైఫ్ అలీ ఖాన్, మురళీ శర్మ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.

Similar News

News January 17, 2026

WCలో బంగ్లాదేశ్.. నేడు క్లారిటీ

image

T20 WCలో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనడంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు <<18871702>>ఐసీసీ<<>> రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. భద్రతా కారణాలతో ముంబై, కోల్‌కతాలో తమ మ్యాచ్‌లు నిర్వహించవద్దని BCB కోరుతోంది. ఈ నేపథ్యంలో ICCకి చెందిన ఇద్దరు అధికారులు నేడు ఢాకాలో పర్యటించి BCB ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. దీంతో ఈ విషయంలో నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

News January 17, 2026

నేడు ముక్కనుమే అయినా నాన్-వెజ్ ఎందుకు తినకూడదు?

image

ముక్కనుమ నాడు మాంసాహారం తినొచ్చు. కానీ, నేడు మాస శివరాత్రి, శనివారం వచ్చాయి. శివరాత్రి శివునికి ప్రీతికరమైనది. అందుకే సాత్వికాహారం తీసుకోవడం ఉత్తమం. అలాగే శనివారం శనిదేవుని, శ్రీనివాసుడి, హనుమాన్ ఆరాధనకు ఉద్దేశించిన రోజు. నియమ నిష్టలు పాటించాలి. ఇలాంటి పవిత్ర తిథి, వారాలు కలిసినప్పుడు మాంసాహారానికి దూరంగా ఉంటే మానసిక ప్రశాంతత, దైవ అనుగ్రహం లభిస్తాయి. అందుకే నేడు శాకాహారానికే ప్రాధాన్యత ఇవ్వండి.

News January 17, 2026

ఇంటి వద్దకే మేడారం ప్రసాదం

image

TG: మేడారం జాతర కోసం TGSRTC వినూత్న సేవలు ప్రారంభించింది. జాతరకు వెళ్లలేని భక్తులు రూ.299 చెల్లిస్తే ఇంటివద్దకే ప్రసాదం వస్తుంది. అమ్మవార్ల ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ఉండే ప్యాకెట్‌ను సురక్షితంగా డెలివరీ చేస్తారు. ఈ సేవలు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బుకింగ్‌కు అవకాశం ఉంది. www.tgsrtclogistics.co.in లేదా 040-69440069, 040-23450033ను సంప్రదించవచ్చు.