News October 4, 2024

ఏపీ టూరిజం డెవలప్మెంట్ డైరక్టర్‌గా బాధ్యతల స్వీకరణ

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరక్టర్‌గా నియమితులైన గంటా స్వరూప్ దేవి శుక్రవారం విజయవాడ కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు, అభిమానులు మధ్య బాధ్యతలు చేపట్టారు. ఈ సంధర్భంగా కుటుంబ సభ్యులు, మిత్రులు స్వరూప దేవికి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 

Similar News

News December 27, 2025

గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించండి: డీఈఓ

image

ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని డీఈఓ కంది వాసుదేవరావు శనివారం తల్లిదండ్రులకు సూచించారు. కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రాథమిక తరగతులకు మాత్రమే గుర్తింపు ఉండి, ఉన్నత తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. గుర్తింపు లేని తరగతుల్లో చదివితే పైచదువులకు అవకాశం ఉండదని హెచ్చరించారు. విద్యాసంస్థల గుర్తింపును పరిశీలించిన తర్వాతే ప్రవేశాలు కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

News December 27, 2025

రాజమండ్రి: 73 ఏళ్ల వయసు.. @ 73 డిగ్రీలు

image

ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కర్రి రామారెడ్డి 73 ఏళ్ల వయసులో 73 డిగ్రీలు సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో సుహృన్మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనకు ‘విద్యాభూషణ’ బిరుదుతో సత్కారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రామారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, నిరంతర విద్యార్థిగా ఆయన యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.