News October 4, 2024
మహిళలపై నేరాలు చూడలేక కళ్లు మూసుకున్న దుర్గామాత విగ్రహం వైరల్
ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ కోల్కతాలో దసరా ఉత్సవాల నిర్వాహకులు ఓ మండపంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం ఆలోచింపజేస్తోంది. జీవచ్ఛవంలా పడి ఉన్న బాధితురాలిని చూడలేక దుర్గామాత కళ్లు మూసుకున్నట్టు, సింహం సిగ్గుతో తలదించుకున్నట్టు విగ్రహాల్ని ఏర్పాటు చేశారు. మహిళలపై నేరాలకు నిరసనగా ఏర్పాటు చేసిన ఈ మండపం ‘లజ్జా’ (అవమానం) ఇతివృత్తంతో ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News December 21, 2024
పాత కార్లపై జీఎస్టీ 18శాతానికి పెంపు
కంపెనీల నుంచి పాత కార్లు కొనేవారిపై GST భారం పడనుంది. పాత ఎలక్ట్రానిక్తో పాటు పెట్రోల్, డీజిల్ కార్లపై GSTని 18శాతానికి పెంచుతున్నట్లు FM నిర్మలా సీతారామన్ తెలిపారు. గతంలో ఈవీలపై 5%, పెట్రోల్, డీజిల్ వాహనాలపై 12% GST ఉండేది. అయితే వ్యక్తుల మధ్య ఈవీల క్రయవిక్రయాలు జరిగితే జీఎస్టీ ఉండదని ఆమె చెప్పారు. మరోవైపు స్విగ్గీ, జొమాటో డెలివరీ ఛార్జీలపై GST తగ్గింపుపై నిర్ణయం తీసుకోలేదన్నారు.
News December 21, 2024
వైభవ్ సూర్యవంశీ మరో ఘనత
బిహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించారు. లిస్ట్-ఏ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ (13 yrs 269 days)నిలిచారు. ఇవాళ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్తో మ్యాచ్లో ఆయన లిస్ట్-ఏ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఈ రికార్డు అలీ అక్బర్ (14 yrs 51 days) ఉండేది. కాగా ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడైన పిన్న వయస్కుడిగానూ వైభవ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
News December 21, 2024
వివాదం కోరుకోవడం లేదంటూనే బన్నీ విమర్శలు
ప్రభుత్వంతో వివాదం కోరుకోవడం లేదంటూనే TG CMకు బన్నీ కౌంటర్ ఇచ్చారు. పర్మిషన్ లేకున్నా రోడ్ షో చేశారని అసెంబ్లీలో రేవంత్ అంటే, రావద్దని పోలీసులు అప్పుడే చెబితే వెనక్కి వెళ్లేవాన్నని బన్నీ చెప్పారు. ఇక అది రోడ్ షో కాదని, కార్పై నుంచి చేయి ఊపానన్నారు. అటు ప్రమాదం గురించి చెప్పి, వెళ్లాలని పోలిస్ హెచ్చరించినా మళ్లీ చేతులూపుతూ వెళ్లారని CM అన్నారు. అయితే తనకు వారు ఏమీ చెప్పలేదని బన్నీ పేర్కొన్నారు.