News October 4, 2024

విశాఖలో రెండో రోజు టెట్ పరీక్షకు 1662 మంది హాజరు

image

జిల్లాలో నిర్వహిస్తున్న టెట్ పరీక్షకు రెండో రోజు శుక్రవారం 1662 మంది హాజరైనట్లు డీఈవో చంద్రకళ వెల్లడించారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండో రోజు 1852 మంది విద్యార్థుల పరీక్ష రాయాల్సి ఉందన్నారు. తాను ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వేర్ మూడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిందని వివరించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అవి వెల్లడించారు.

Similar News

News December 22, 2024

రైవాడ అందాలను ‘క్లిక్’మనిపించిన పవన్ కళ్యాణ్

image

రైవాడ జలాశయ అందాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఫోన్‌లో చిత్రీకరించారు. బల్లగరువు బహిరంగ సభకు వెళ్లే క్రమంలో రైవాడ జలాశయ అందాలను తిలకించేందుకు జీనబాడు – కోలపర్తి సమీపంలో పవన్ కళ్యాణ్ కారు దిగి ఆ ప్రాంతంలో అందాలను ఆస్వాదించారు. ఈ సందర్భంలో ఫోన్లో ఆ సుందరమైన కొండల మధ్యలో జలాశయ అందాలను బంధించారు.

News December 22, 2024

జీవీఎంసీలో స్టాండింగ్ కౌన్సిల్ నియామకాలకు నోటిఫికేషన్

image

జీవీఎంసీ తరపున స్టాండింగ్ కౌన్సిల్‌లో నియమించుటకు న్యాయవాదుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.8 మంది న్యాయవాదులు నియామకం నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేసారు.బార్ కౌన్సిల్స్ లో కనీసం 10 సంవత్సరాల మెంబర్‌గా రిజిస్ట్రేషన్ అయిన వారు మాత్రమే అర్హులని తెలిపారు.ఆసక్తి గలవారు జనవరి 6 లోపు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలన్నారు.

News December 22, 2024

గంజాయి స్మగ్లింగ్ ద్వారా ఆస్తులు సంపాదించడం నేరం: డీఐజీ

image

గంజాయి స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన ఆస్తులు కొనుగోలు చేయడం నేరం అని డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దోషులుగా ఉన్న వ్యక్తుల నుంచి ఆస్తులు కొనుగోలు చేయడం గానీ, డబ్బు చెలామణి జరిగినట్టు రుజువు ఐతే జప్తు చేయబడుతుందన్నారు. లావాదేవీలు జరిపే వారి పై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.