News October 4, 2024
అలర్ట్.. నాలుగు రోజుల పాటు వర్షాలు

TG: రాష్ట్రంలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రేపు నిజామాబాద్, సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయంది.
Similar News
News January 13, 2026
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. సెన్సెక్స్ 159 పాయింట్లు లాభపడి 84,038 వద్ద.. నిఫ్టీ 45 పాయింట్లు పెరిగి 25,836 దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో ఎటర్నల్, టెక్ మహీంద్రా, SBI, BEL, HDFC బ్యాంక్ షేర్లు లాభాల్లో.. ఎల్ అండ్ టీ, TCS, రిలయన్స్, M&M, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
News January 13, 2026
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పబ్లిక్ టాక్

రవితేజ-కిశోర్ తిరుమల కాంబోలో రూపొందిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ఇవాళ రిలీజైంది. విదేశాల్లో ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు తమ అనుభవాలను SM వేదికగా పంచుకుంటున్నారు. ‘స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్‌లా అనిపించినా ఫస్ట్ హాఫ్‌లో కామెడీ మెప్పిస్తుంది. పాటలు ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి’ అని కామెంట్స్ చేస్తున్నారు. కాసేపట్లో Way2Newsలో మూవీ రివ్యూ&రేటింగ్.
News January 13, 2026
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ వాయిదా

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ జరగాల్సిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రోగ్రాం వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పండుగ వేళ ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబాలతో కలిసి ఉంటారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా మూడో శనివారం జరగాల్సిన కార్యక్రమాన్ని జనవరిలో నాలుగో శనివారం నిర్వహించనున్నారు.


