News October 4, 2024
అభిమానులకు రజినీకాంత్ సందేశం

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తన కుటుంబసభ్యులు, సన్నిహితులు, సహచర నటులు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మీ ప్రార్థనలే తనకు శ్రీరామరక్షగా నిలిచాయని పేర్కొన్నారు. కాగా రజినీ నటించిన ‘వేట్టయన్’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Similar News
News January 21, 2026
వరిలో పాముపొడ(మాగుడు) తెగులు – నివారణ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గాలిలో తేమ వల్ల వరిలో పాముపొడ తెగులు ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది. వరి దుబ్బు చేసే దశలో ఇది వ్యాపిస్తుంది. వరి కాండం, ఆకులపై పాము పొడ లాంటి మచ్చలు కనిపిస్తాయి. తెగులు తీవ్రమైతే మొక్కలు ఎండి, తాలు గింజలు ఏర్పడతాయి. దీని నివారణకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400ml హెక్సాకొనజోల్ 5 SP లేదా 400ml వాలిడామైసిన్ 3 SL లేదా 200ml ప్రోపికొనజోల్ 25% EC కలిపి పిచికారీ చేయాలి.
News January 21, 2026
దానిమ్మ రైతులకు కాసుల పంట.. టన్ను రూ.2 లక్షలు

AP: దానిమ్మ రైతులకు మంచి రోజులు వచ్చాయి. 3 నెలల క్రితం టన్ను రూ.50వేల నుంచి రూ.60 వేల వరకు పలికిన దానిమ్మ ఇప్పుడు ఏకంగా రూ.2 లక్షలు పలుకుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట తెగుళ్లు, బ్యాక్టీరియా బారిన పడకుండా జాగ్రత్తగా సాగు చేయడం వల్లే రేట్లు పెరిగాయని చెబుతున్నారు. కాగా రాష్ట్రంలో 15వేలకు పైగా హెక్టార్లలో (ప్రధానంగా రాయలసీమ) దానిమ్మ పంట పండిస్తున్నారు.
News January 21, 2026
పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.


