News October 4, 2024
సెకండ్ రిలీజ్‌లో ‘తుంబాడ్’ సంచలనం

సూపర్ నేచురల్ కథాంశాన్ని సస్పెన్స్‌తో ముడిపెట్టి రూపొందించిన ‘తుంబాడ్’ సినిమా రీ-రిలీజ్‌లో దుమ్మురేపుతోంది. ఆరేళ్ల క్రితం తొలి రిలీజ్‌లో దేశవ్యాప్తంగా కేవలం రూ.12.30 కోట్లే కలెక్ట్ చేసిన ఈ మూవీ, సెకండ్ రిలీజ్‌లో ఇప్పటి వరకు ఏకంగా రూ.30 కోట్లు వసూలు చేసింది. దసరా సెలవులు వచ్చిన నేపథ్యంలో రూ.50 కోట్ల మార్కు దాటే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
Similar News
News January 29, 2026
AI షాక్: 2008 కంటే ఘోరమైన సంక్షోభం రాబోతుందా?

భవిష్యత్తులో కృత్రిమ మేధ (AI) వల్ల 2008 నాటి ఆర్థిక మాంద్యం కంటే దారుణమైన పరిస్థితులు రావొచ్చని 2025-26 ఆర్థిక సర్వే హెచ్చరించింది. దీనికి అవకాశం తక్కువే ఉన్నా.. జరిగితే మాత్రం ప్రభావం తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. ‘భారత్‌లోని IT రంగం, వైట్ కాలర్ ఉద్యోగాలకు AI పెద్ద ముప్పుగా మారనుంది. ఇప్పటికే IT రంగంలో వృద్ధి ఉన్నా దానికి తగ్గట్టుగా కొత్త ఉద్యోగాలు రావడం లేదు’ అని సర్వే పేర్కొంది.
News January 29, 2026
HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్ 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల వారు ఫిబ్రవరి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA(ఫైనాన్స్, ఆపరేషన్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్), బీఫార్మసీ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిప్యూటీ మేనేజర్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. అసిస్టెంట్ మేనేజర్‌కు 37ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.lifecarehll.com
News January 29, 2026
అనుమతి లేకుండా NTR పేరు, బిరుదులు వాడొద్దు: ఢిల్లీ హైకోర్టు

జూ.NTR వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇకపై NTR, జూనియర్ NTR, తారక్, మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ తదితర పేర్లు, బిరుదులను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడాన్ని నిషేధించింది. తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వ్యక్తిత్వానికి భంగం కలిగే పోస్టులను వెంటనే తొలగించాలని చెప్పింది.


