News October 4, 2024

HYD: అమ్మవారి ఫేమస్ ఆలయాలకు మీరు వెళ్లారా?

image

HYD,ఉమ్మడి RRలోని ప్రసిద్ధ అమ్మవారి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ మహంకాళమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బల్కంపేట్ ఎల్లమ్మ, శామీర్‌పేట్ కట్ట మైసమ్మ, చార్మినార్ భాగ్యలక్ష్మీ, గోల్కొండ జగదాంబిక, లాల్‌దర్వాజ సింహవాహిని,మైసిగండి మైసమ్మ, కొత్తపేట అష్టలక్ష్మీ, బోడుప్పల్ నిమిషాంబిక ఆలయాల్లో వివిధ రూపాల్లో మాతలు దర్శనమిస్తున్నారు.మరి ఈఆలయాలకు మీరు వెళ్లారా కామెంట్ చేయండి.

Similar News

News September 18, 2025

చిత్ర పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: సీఎం

image

సినీ కార్మికులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నైపుణ్య శిక్షణ, ఆరోగ్య బీమా కల్పించి, చిన్న బడ్జెట్ సినిమాలకు సహాయం చేస్తామన్నారు. HYDను హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్దామని చెప్పారు. ‘గద్దర్ అవార్డులు’ కొనసాగిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలు స్వయంగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో, వారు కృతజ్ఞతలు తెలిపారు.

News September 18, 2025

BREAKING.. HYDలో భారీ ట్రాఫిక్.. 5KMల వరకు నరకం..!

image

HYDలో కొద్ది గంటలుగా కురుస్తోన్న వర్షంతో నగరంలో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో అమీర్‌పేట్- బేగంపేట్, సికింద్రాబాద్, సోమాజీగూడ- బేగంపేట్, సికింద్రాబాద్‌‌‌‌కు వెళ్లే వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషన్ కింద భారీగా వర్షపు నీరు చేరడంతో దాదాపు 5 KMల వరకు ట్రాఫిక్ స్తంభించినట్లు తెలుస్తోంది. కాగా, ట్రాఫిక్ పునరుద్ధరణకు పోలీసులెవరూ ఇంకా రంగంలోకి దిగకపోవడం గమనార్హం.

News September 18, 2025

జూబ్లీ అభయం: ఒకరికి CM.. మరొకరికి పీసీసీ..!

image

జూబ్లీహిల్స్ టికెట్ కేటాయింపులో కొత్త రాజకీయం బయటకు వస్తుందని గాంధీభవన్‌లో చర్చ నడుస్తోంది. మొన్నటిదాకా సైలెంట్‌గా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ అనూహ్యంగా టికెట్ కోసం ప్రయత్నాలు చేయడం వెనక పీసీసీ వర్గం ఉన్నట్లు అంచనా. అంజన్‌కు టికెట్ ఇప్పించేందుకు పీసీసీ సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడి నుంచి నవీన్ కుమార్ లేదా దానం నాగేందర్‌కు మద్దతుగా ఉన్నట్లు టాక్.